PM Modi-Aman Sehrawat: ‘మీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది’.. అమన్తో ఫోన్లో ప్రధాని
- రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని మోడీ ఫోన్
- నీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది..- అమన్తో ప్రధాని
- మీకు చాలా అభినందనలు.. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు- మోడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. ‘నువ్వు కష్టపడి ఇక్కడికి చేరుకున్నావు కాబట్టి నీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది’ అని అమన్తో ప్రధాని అన్నారు. శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అమన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్యం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో అమన్ 13-5 తేడాతో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌ను ఓడించాడు.
ప్రధాని అమన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘మీకు చాలా అభినందనలు, మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు’. అని తెలిపారు. మీరు మీ పేరును యావత్ దేశం హృదయాల్లో నింపారన్నారు. ఛత్రసాల్ స్టేడియంను తమ ఇల్లుగా మార్చుకునే ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.. కానీ మీరు దానిని మీ ఇల్లుగా మార్చుకున్నారని పేర్కొన్నారు. మీ జీవితం దేశప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకమని మోడీ తెలిపారు. ఒలింపిక్స్‌లో పతకం తెస్తున్న అతి పిన్న వయస్కుడివి.. మీకు చాలా భవిష్యత్ ఉంది. మీరు దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని నమ్ముతున్నానని ప్రధాని పేర్కొన్నారు. నీ జీవితంలో చాలా కష్టపడ్డావు.. మీ తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత కూడా ఏ మాత్రం బెదరలేదన్నారు. మీ జీవితం చాలా స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
COVID-19 warning: కరోనాపై డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్.. దేశాలకు అలర్ట్ జారీ
మరోవైపు.. అమన్ మాట్లాడుతూ, 2028లో బంగారు పతకం సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మోడీ మాట్లాడుతూ.. మీరు స్వర్ణం సాధిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఈ ఒలింపిక్స్లో దేశప్రజలు బంగారు పతకం సాధిస్తావని అందరూ భావించారు.. కానీ అది సాధ్యపడలేదు. కానీ 2028లో తప్పకుండా సాధిస్తావని ప్రధాని అమన్‌కు చెప్పారు. ఇప్పుడు సాధించింది కాంస్యమా, రజతమా, బంగారు పతకమా అని చూడకు.. నువ్వు ఆ చింతను విడిచిపెట్టు అని మోడీ తెలిపారు. మీరు దేశానికి చాలా ఇచ్చారు.. దేశప్రజలందరూ గర్వంగా ఉన్నారన్నారు. అమన్ మాట్లాడుతూ.. దేశానికి తాను ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. అమన్ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని.. ఈ కల ఉన్నవారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ప్రధాని మోడీ చెప్పారు.
పారిస్ క్రీడల్లో భారత్ కు ఇప్పటి వరకు ఆరో పతకాలు వచ్చాయి. అందులో ఐదు కాంస్యం, ఒక రజతం సహా మొత్తం ఆరు పతకాలు సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున అమన్ ఏకైక పురుష రెజ్లర్. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి భారత్ ప్రతి ఒలింపిక్స్‌లోనూ రెజ్లింగ్‌లో పతకాలు సాధిస్తూ వస్తోంది. 2008లో సుశీల్ కుమార్ కాంస్యం, 2012లో సుశీల్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం, 2016లో సాక్షి మాలిక్ కాంస్యం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రవి దహియా రజతం, బజరంగ్ పునియా కాంస్యం సాధించారు.
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!