మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత మహిళా రెజ్లర్ రితికా హుడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె 12-2తో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని టెక్నికల్ సుపీరియారిటీను ఓడించింది. మొదటి రౌండ్ నుంచి రితికా ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో భారీ తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు క్వార్టర్ ఫైనల్స్‌లో కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన రెజ్లర్ ఐపెరి మెడెట్ కీజీతో రెజ్లర్ రితికా తలపడనుంది. ఫ్రీస్టైల్ 76 కేజీల ప్రీక్వార్టర్ ఫైనల్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించిన మహిళా రెజ్లర్ రితికా.. ఈ రోజు పారిస్ ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది.
Read Also: Bangladesh: ఎదురుతిరిగిన హిందువులు.. బంగ్లా వ్యాప్తంగా నిరసనలు..
ఈ విజయంంతో 76 కేజీల విభాగంలో అర్హత సాధించిన తొలి భారతీయ మహిళగా రితికా హుడా చరిత్ర సృష్టించింది. రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లలో పతక విజేత అయిన నాగి, రీతికా అద్భుత ప్రదర్శన ముందు తట్టుకోలేకపోయింది. గత సంవత్సరం.. రీతికా U-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా అవతరించింది. USA యొక్క కెన్నెడీ బ్లేడ్స్‌ను ఓడించింది.