Paris Olympics: అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం..ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కారం
- అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం
- ఒలింపిక్ లో అత్యుత్తమ సేవలు
- ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించనున్న ఐఓసీ
- 142వ ఐఓసీ సెషన్‌లో ఆయనకు ఈ గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత షూటర్ అభినవ్ బింద్రాకు పారిస్ ఒలింపిక్ లో అరుదైన గౌరవం దక్కనుంది. ఒలింపిక్ లో అత్యుత్తమ సేవలందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఈ రోజు ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించనుంది. ఒలింపిక్స్ ముగియడానికి ఒక రోజు ముందు పారిస్‌లో జరిగే 142వ ఐఓసీ సెషన్‌లో ఆయనకు ఈ గౌరవం
ఇవ్వబడుతుంది. అంతకుముందు.. 1983లో దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఈ అవార్డుతో సత్కరించారు.
READ MORE: Nagarjuna Sagar: సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు.. చూసేందుకు పర్యాటకుల సందడి..
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
1975లో స్థాపించబడిన ఒలింపిక్ ఆర్డర్..
ఒలింపిక్ లో అత్యున్నత పురస్కారం. ఒలింపిక్స్ సమయంలో లేదా దానికి సంబంధించి విశిష్ట సహకారం అందించినందుకు ఇది ఇవ్వబడుతుంది. అంటే.. క్రీడలను ప్రోత్సహించడానికి విలువైన ప్రయత్నాల ఆధారంగా వ్యక్తులను ఎంపిక చేస్తారు. ఈ సారి భారత్ కు చెందిన అభినవ్ బింద్రాకు ఈ అవకాశం రావడం భారత క్రీడాకారులకు గౌరవం. ఐఓసీ ప్రతి ఒలింపిక్ క్రీడల ముగింపు వేడుకలో ప్రధాన జాతీయ నిర్వాహకులకు ఒలింపిక్ ఆర్డర్‌ను ప్రదానం చేస్తుంది.
READ MORE:AP Anti Narcotic Task Force: డ్రగ్స్, గంజాయి కట్టడికి చర్యలు.. APNTF ఏర్పాటుకు కసరత్తు..
ఒలింపిక్ ఆర్డర్ హానర్ అంటే ఏమిటి?
ఒలింపిక్ ఆర్డర్ అనేది ఐఓసీ యొక్క అత్యున్నత పురస్కారం. ఇది ఒలింపిక్ ఉద్యమంలో విశిష్ట కృషికి అందించబడుతుంది. ఒలింపిక్ ఆదర్శాన్ని ప్రతిబింబించిన, క్రీడా ప్రపంచంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన.. క్రీడల అభివృద్ధికి తన సహకారం అందించిన వ్యక్తిని గౌరవించటానికి దీనిని ప్రదానం చేస్తారు. దీని నామినేషన్లను ఒలింపిక్ ఆర్డర్ కౌన్సిల్ ప్రతిపాదించింది. ఎగ్జిక్యూటివ్ బోర్డు వ్యక్తిని ఎంపిక చేస్తుంది.
READ MORE:Paris Olympics 2024: నేడు భారత్ కు ఏడో పతకం రావొచ్చు..భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే..
బింద్రా 2008లో స్వర్ణం..
41 ఏళ్ల బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించారు. భారతదేశానికి మొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధించి రికార్డు సృష్టించారు. 2010 నుంచి 2020 వరకు ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) యొక్క అథ్లెట్ల కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 2014 నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2018 నుంచి ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ సభ్యుడి ఉన్నారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..