Supreme Court: చనిపోయినోళ్ల బ్యాంక్ వివరాలు బిడ్డలకు ఎందుకు చెప్పకూడదు.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- చనిపోయినోళ్ల బ్యాంక్ వివరాలు బిడ్డలకు ఎందుకు చెప్పకూడదు
- ఆర్బీఐ, కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చనిపోయిన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల వివరాలు వారసులకు ఎందుకు చెప్పకూడదని కేంద్రాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. బ్యాంకు ఖాతాల్లో స్తంభించి ఉన్న నగదు.. ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి చట్టపరమైన వారసులకు తెలియజేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ జర్నలిస్ట్ సుచేతా దలాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ విషయంలో కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, ఆర్‌బీఐలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
‘‘ఒక వ్యక్తికి వేర్వేరు దేశాల్లో 10 వేర్వేరు ఖాతాలు ఉండి.. అతను వీలునామా లేకుండా మరణిస్తే.. అతని వారసులకు ఆ వివరాలు ఎలా తెలుస్తాయి? అతను కేవైసీ (KYC) చేయించి ఉండకపోవచ్చు… ఇది విధానపరమైన ప్రశ్న కాదు. ఆ బదిలీ చట్టవిరుద్ధమని మేము చెప్పడం లేదు. మేము అంటున్నది ఏమిటంటే.. చట్టపరమైన వారసులకు సమాచారం ఇస్తే తప్పేంటి? మీరు ఏదైనా ఒక విధానంతో ముందుకు రావాలి.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ఇది కూడా చదవండి: Akshay Kumar: గ్యాస్ సంక్షోభం వేళ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వంటింటి గుట్టు వెల్లడి
విచారణ సందర్భంగా దలాల్ తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. క్లెయిమ్ చేయని ఖాతాల వివరాలను బహిరంగపరచాలని పిటిషనర్ ఆదేశాలు కోరారని పేర్కొన్నారు. మరణించిన తమ తల్లిదండ్రుల ఖాతాలను ప్రజలు గుర్తించుకునేందుకు వీలుగా ఒక “కేంద్రీకృత మరియు శోధించదగిన డేటాబేస్” ఉండాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ కూడా సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. ఇక కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ మాట్లాడుతూ.. ఒకవేళ నిజమైన వారసుడు ముందుకు వస్తే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ నుంచి ఆ మొత్తాన్ని వారికి వాపసు ఇస్తారని తెలిపారు. అయితే ఈ విషయంలో కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, ఆర్‌బీఐలను సుప్రీంకోర్టు ఆదేశించి.. విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో షాకింగ్ ఘటన.. ట్రంప్ ఉన్నతాధికారి రాజీనామా.. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!