పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ఆరో పతకాన్ని అందించిన అమన్ సెహ్రావత్.. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు ఈ ఘనత పీవీ సింధు పేరిట ఉంది. పివి సింధు 21 సంవత్సరాల, 1 నెల.. 14 రోజుల వయస్సులో రియో ఒలింపిక్స్ 2016లో పతకం సాధించింది. ఇప్పుడు అమన్ 21 సంవత్సరాల 24 రోజుల వయస్సులో పతకం సాధించడం ద్వారా భారతదేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ఒలింపిక్ పతక విజేతగా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో సైనా నెహ్వాల్ పేరు మూడో స్థానంలో నిలిచింది. 22 సంవత్సరాల 4 నెలల 18 రోజుల వయస్సులో 2012 లో లండన్‌లో పతకాన్ని గెలుచుకుంది.
READ MORE: Suriyas Kanguva : స్టార్ హీరో సూర్య కంగువా.. ట్రైలర్ బ్లాస్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
మను భాకర్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉంది. ఈ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించాడు. మను 22 సంవత్సరాల, 5 నెలల.. 10 రోజుల వయస్సులో తన మొదటి పతకాన్ని గెలుచుకుంది. కేవలం రెండు రోజుల తరువాత 22 సంవత్సరాల, 5 నెలల.. 12 రోజుల వయస్సులో పతకాన్ని గెలుచుకుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు ఆరు పతకాలు సాధించింది. ఇందులో మూడు పతకాలు హర్యానాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన క్రీడాకారుల పేరిట ఉన్నాయి. ఝజ్జర్‌కు చెందిన అమన్ సెహ్రావత్, మను భాకర్ మూడు పతకాలు ఖాతాలో వేసుకున్నారు.
READ MORE: Suriyas Kanguva : స్టార్ హీరో సూర్య కంగువా.. ట్రైలర్ బ్లాస్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
కాగా..21 ఏళ్ల అమన్ సెహ్రావత్ ఒలింపిక్స్ ప్రయాణం అంత సులభం కాదు. అమన్ సెహ్రావత్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. జాట్ కుటుంబానికి చెందిన అమన్ హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని బిరోహార్ నుంచి వచ్చాడు. అతను 11 సంవత్సరాల వయస్సులో తన పేరెంట్స్ దూరమయ్యారు. గతంలో అమన్ పదేళ్ల వయసులో తల్లి గుండెపోటుతో మరణించింది. ఓ సంవత్సరం తర్వాత అతని తండ్రి కూడా చనిపోయాడు.