Indian Hockey Team: ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం..
- పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుని..
- స్వదేశానికి తిరిగి వచ్చిన భారత పురుషుల హాకీ జట్టు
- ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు పూల మాలలు వేసి ఘన స్వాగతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు శనివారం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు డప్పు వాయిద్యాలతో, పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. వేసి ఉదయం నుంచి భారత ఆటగాళ్ల కోసం విమానాశ్రయం లోపల అభిమానులు భారీ సంఖ్యలు వేచి ఉన్నారు. ఆటగాళ్లు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత భారత హాకీ జట్టు ఆటగాళ్లు ఢిల్లీ విమానాశ్రయం వెలుపల సంబరాలు చేసుకున్నారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు.
S Jaishankar: మాల్దీవుల ప్రెసిడెంట్‌తో జైశంకర్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ఈ సందర్భంగా హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ భోళనాథ్ సింగ్ మాట్లాడుతూ.. పారిస్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో జెండా బేరర్‌గా పీఆర్ శ్రీజేష్ ఎంపిక కావడం గురించి మాట్లాడారు. పిఆర్ శ్రీజేష్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో పతాకధారిగా అర్హుడని తెలిపారు. భారత ప్రభుత్వం, భారత ఒలింపిక్ కమిటీ అతనికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు హాకీ ఇండియా తరుఫున ధన్యవాదాలు తెలిపారు. వరుసగా రెండు పతకాలు సాధించడం ఒక గొప్ప విజయం అని అన్నారు. తమ లక్ష్యం ఫైనల్ ఆడటం, కానీ అమిత్ రోహిదాస్‌ను సిట్ అవుట్ చేయడంలో రిఫరీ చేసిన పొరపాటు కారణంగా తాము ఓడిపోయామన్నారు. అందుకే తాము కాంస్య పతకంతో ఇక్కడకు వచ్చాము. లేకుంటే పతకం రంగు మారి ఉండేదని పేర్కొన్నారు.
Manish Sisodia: అలా చేస్తే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారు..
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత హాకీ జట్టు పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.. మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారిస్‌లో కూడా భారత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించింది. అంతకుముందు సెమీస్‌లో జర్మనీ చేతిలో భారత్ 3-2 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత హాకీలో భారత్ స్వర్ణం సాధించలేదు. హాకీలో భారత్ ఇప్పటి వరకు ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించింది. భారత పురుషుల హాకీ జట్టు 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది. ఇంతకు ముందు 1968, 1972లో పతకాలు సాధిచింది.
Our Heroes are back!
Current mood: 🥳🎊🕺🏻🥁#BronzeMedalists #BackHome #HockeyIndia pic.twitter.com/MA78WcZS7q
— Hockey India (@TheHockeyIndia) August 10, 2024
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!