వినేశ్ ఫోగట్ పిటిషన్‌పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈరోజు ఆమె పిటిషన్ పై తీర్పు వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ, పారిస్ స్పోర్స్ కోర్ట్ తీర్పు వాయిదా వేసింది. 24 గంటలపాటు నిర్ణయాన్ని పొడిగించింది. రేపు (ఆదివారం) తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాగా.. ఈరోజు(శుక్రవారం నాడు) కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో వినేష్ ఫోగట్ పిటిషన్ పై విచారణ జరిగింది.
Gurugram: కార్ల వర్క్‌షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 లగ్జరీ కార్లు దగ్ధం
ఈ క్రమంలో స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ తన నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించనుంది. కాగా.. వినేశ్ కు రజత పతకం ఇవ్వాలని స్పోర్ట్స్ ట్రిబ్యునల్‌ను కోరింది. ఆమె రెజ్లింగ్ ఫైనల్ కు ముందు 100 గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హురాలిగా ప్రకటించారు. దీంతో వినేష్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ దాఖలు చేసింది. కాగా.. 50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరినందుకు కంబైన్డ్ సిల్వర్ మెడల్ ఇవ్వాలని వినేష్ ఫొగట్ విజ్ఞప్తి చేసింది. దీనిపై విచారణ పూర్తయినప్పటికీ తీర్పు వెలువడలేదు. ఈ తీర్పు కోసం భారతదేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆమెకు మెడల్ రావాలని కోరుకుంటున్నారు.
Tamil Nadu: కొడైకెనాల్‌లో విషాదం.. యువకుల ప్రాణాలు తీసిన బార్బీ క్యూ చికెన్
ఇదిలా ఉంటే.. రేపటితో పారిస్ ఒలింపిక్స్ క్రీడలు ముగియనున్నాయి. కాగా.. ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు భారత్ తరుఫున భారత హాకీ జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్, కాంస్య పతకాల విజేత, షూటర్ మనూ భాకర్‌తో కలిసి ఫ్లాగ్‌బేరర్ హోదాలో ముందుండి నడవనున్నారు.