Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది, ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ అయిన హఫీస్ సయీద్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం విస్తృత భద్రతను కల్పించింది. ముఖ్యంగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతను మరించి పెంచింది. 26 మందిని టూరిస్టులు మరణించడానికి లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ కారణం. దీంతో, భారత్ పాకిస్తాన్‌తో పాటు ఈ కుట్రకు పాల్పడిన ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను విడిచిపెట్టమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లాహోర్‌లోని…
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి కోరారు. షాబాజ్, జైశంకర్‌లతో విడివిడిగా చర్చలు జరిపిన తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. Also Read:Thopudurthi Prakash…
Pakistan: 26 మంది టూరిస్టుల్ని బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ భయపడి చస్తోంది. ఇదిలా ఉంటే, పాక్ అంతర్గత పరిస్థితులు కూడా ఆశాజనకంగా లేవు. బలూచిస్తాన్‌లో బీఎల్ఏ, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దెబ్బకు పాక్ సైన్యం తోకముడుస్తోంది. పాక్ సైన్యంలో పంజాబ్ ఆధిపత్యాన్ని ఇతర ప్రాంతాలు సహించడం లేదు. Read Also: Shahid Afridi: షాహిద్…
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కి భారత్ షాక్‌లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే దౌత్యపరంగా దెబ్బతీసింది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై అణిచివేత చర్యలు చేపట్టింది.
Shahid Afridi: షాహిద్ అఫ్రీది..క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియనివారు ఉండరు. మన దాయాది దేశమైన పాకిస్తాన్‌కి చాలా ఏళ్లు క్రికెట్ ఆడాడు. అయితే, పలు సందర్భాల్లో భారత్ అన్నా, హిందువులు అన్నా ద్వేష భావం అతడిలో కనిపిస్తుంటుంది. తాజాగా, పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఉగ్రవాదాన్ని సమర్థించాడు. ఈ నేపథ్యంలో అతడి యూట్యూబ్ ఛానెల్‌ని కేంద్రం బ్యాన్ చేసింది.
Supreme Court: జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ ఘటనకు పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది.
Shahid Afridi: 26 మందిని బలి తీసుకున్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. లష్కరే తోయిబా ప్రాక్సీ ఉగ్రసంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఇప్పటికే భారత్ దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఈ చర్యతో పాకిస్తాన్‌కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పాక్ 80 శాతం ప్రజలు ఈ సింధు, దాని ఉపనదులపైనే…
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మంగళవారం జరిగిన అత్యున్నత భేటీలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతీకారం కోసం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బుధవారం కూడా ప్రధాని వరస మీటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే, భారత్ సైనిక చర్యకు ప్లాన్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, భారత్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తుందో అని దాయాది దేశం పాకిస్తాన్ హడలి…
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. బయటకు భారత్‌ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. తటస్థ, పారదర్శక విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటిస్తోంది.
Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకస్తాన్ భారీ ఎత్తున భద్రత కల్పిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే ప్రాక్సీ అయిన ‘‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులే. పహల్గామ్ దాడి తర్వాత భారత టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీస్ సయీద్ ఉన్నాడని తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ అతడికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు తెలుస్తోంది.