IND vs Ban: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్‌పై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఈశాన్య భారతదేశంలోని కీలక రాజకీయ నాయకులు, పలు పార్టీలు పిలుపునిచ్చాయి.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడితో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాయాది దేశానికి భారత్ తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో పీవోకేలో గల ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తుంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్.. మరోసారి నెత్తురోడింది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి.. 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. దీని వెనక పాకిస్థాన్ ఉందని తేలిపోవడంతో దేశమంతా రగలిపోతుంది. యుద్ధం ప్రకటించి.. దాయాదికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మన సత్తా చూపాలని, పాకిస్థాన్ తిరిగి లేవకుండా.. చావ చితక్కొట్టాలని చాలామంది కోరుతున్నారు.
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన పాకిస్తాన్ ఇప్పుడు వణుకుతోంది. భారత్ ఎలా స్పందిస్తుందో అని రోజులు లెక్కబెట్టుకుంటోంది. ముఖ్యంగా, పాకిస్తాన్‌ని కలిపి ఉంచేది ఆ దేశపు ఆర్మీ. అయితే, అలాంటి పాకిస్తాన్ ఆర్మీలోనే భారత్ దేశం అంటే భయం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ఏ విధంగా తమపై విరుచుకుపడుతుందో తెలియక పాక్ ఆర్మీ నిలువెల్లా వణికిపోతోంది. ఇప్పటికే, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ జనానికి కనిపించకుండా ఉన్నాడు.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడం పాకిస్తాన్‌ని కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు, భారత్ సైనిక చర్యకు దిగవచ్చనే భయం ఆ దేశంలో ఉంది. బయటకు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ పాక్ ఆర్థిక పరిస్థితి, అంతర్గత సమస్యలు, ఆర్మీలో గ్రూపులు అన్ని కూడా ఆ దేశానికి ప్రతీకూలంగానే ఉన్నాయి.
Karnataka Minister: పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో అమాయకపు టూరిస్టులు 26 మంది మరణించారని యావత్ దేశం తీవ్ర బాధలో ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుంబంధ టీఆర్ఎఫ్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఈ దాడికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ ముష్కరులు టార్గెట్ చేయడాన్ని భారత సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఇదిలా ఉంటే, కొందరు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే,…
Pahalgam Terror attack: 26 మంది టూరిస్టుల ప్రాణాలను తీసిన పహల్గామ్ ఉగ్ర దాడిలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల ప్లానింగ్, వారికి సాయం చేసిన వారి గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక సమాచారాన్ని వెలికి తీశాయి. ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు, ఒకరు స్థానిక ఉగ్రవాది దాడిలో పాల్గొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం, ఉగ్రవాదులు K-47, M4 రైఫిల్స్ వాడినట్లు తెలిసింది. అత్యంత క్లిష్టతరమైన హిమాలయాలు,
CM Siddaramiah: కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాకిస్తాన్ వ్యాప్తంగా హెడ్‌లైన్‌గా నిలిచారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, దీని గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌తో యుద్ధం వద్దని, పాకిస్తాన్‌తో యుద్ధానికి తాను అనుకూలం కాదు’’ అని అన్నారు.