Pakistan Army: పహల్గాం ఉగ్ర దాడికి బదులుగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటల సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులను ప్రారంభించింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. దీంతో సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంట పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు మృతి చెందారు. అమాయక ప్రజలను పాక్ బలి తీసుకుందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దీనికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది.