Operation Sindoor: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారతదేశం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌పై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టినట్లు ఇండియన్ సైన్యం ప్రకటించింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతోనే పాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందంటున్నారు.
Read Also: VD 14 : విజయ్ దేవరకొండతో రష్మిక రొమాన్స్
అయితే, ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరెందుకు పెట్టారనే విషయంపై ఒక థియరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గామ్ లో భార్యల కళ్ల ముందే భర్తలను చంపి ఉగ్రవాదులు మన ఆడబిడ్డల నుదటిన సింధూరాన్నితుడిచి వేశారు. దానికి ప్రతికారమే ఈ దాడి అన్న అర్థంలో సింధూర్ అని త్రివిధ దళాలు పేరు పెట్టాయని ప్రచారం జరుగుతుంది.
Read Also: Dulquer : ‘కాంత’ నుండి భాగ్యశ్రీ బోర్సే అదిపోయే లుక్..
కాగా, ఈ ఆపరేషన్‌ను త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో చేశాయి. కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన క్యాంప్‌లను ఇప్పటికే నేలమట్టం చేసేశాయి.