Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా వేట కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా, ఉగ్రవాదులకు సంబంధించి ఇళ్లను భద్రతా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. గత 48 గంటల్లో, భద్రతా బలగాలు, స్థానిక అధికారుల సమన్వయంతో జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చేసి, ఉగ్రవాదికి వ్యతిరేకంగా తమ చర్యల్ని ముమ్మరం చేశాయి.
Omar Abdullah: పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు.
India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి దాడి చేస్తుందో అని పాకిస్తాన్ హడలి చేస్తోంది. బయటకు తన ప్రజల మెప్పు కోసం ఎన్నో బీరాలు పలుకుతున్నప్పటికీ, లోలోపల మాత్రం భయపడుతోంది. ఇప్పటికే, ఆర్థిక దరిద్రంలో పాకిస్తాన్ ఉంది. యుద్ధం చేస్తే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుందనేది అక్కడి ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. యుద్ధం చేయాల్సి వస్తే, మూడు రోజులకు సరిపడే చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు, ఒక వేళ యుద్ధం కోసం…
ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేవారు.. పహల్గామ్లో జరిగిన దాడి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్చగా పేర్కొన్నారు సత్యకుమార్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఏ నిర్ణయం అయినా.. మా మద్దతు ఉంటుంది అని ఆగ్రదేశాలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు..
Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది సాధారణ పౌరులు, ముఖ్యంగా మతం ఆధారంగా హిందువుల్ని లక్ష్యంగా చేయడం పట్ల యావత్ దేశం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ మేరకు పాకిస్తాన్పై తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాను పాకిస్థాన్ వెళ్లనని.. తాను ప్రస్తుతం భారతీయ కోడలినని.. తనను ఇక్కడే ఉండనివ్వాలని అని సీమా హైదర్ విజ్ఞప్తి చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ వీసాలను కేంద్రం రద్దు చేసింది. ఏప్రిల్ 29లోపు అందరూ వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది.
పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఆదిల్ అహ్మద్ థోకర్కు సంబంధించిన కీలక విషయాలను నిఘా సంస్థలు రాబట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్దే కీలక రోల్గా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. ఆ సమస్యనే పాకిస్థాన్-భారత్ పరిష్కరించుకోవాలని సూచించారు.
Iran: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ పాక్కి వ్యతిరేకంగా దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జల ఒప్పందం’’ని రద్దు చేసింది. సింధు, దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు పాక్కి వెళ్లకుండా ప్రణాళికలు రచిస్తోంది.