India PakistanTensions: భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇప్పటి వరకు భారత ఆర్మీ ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. కాగా, ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆర్మీ దాడులు కొనసాగుతాయని ప్రకటించింది. అయితే, అర్థరాత్రి 1.44 గంటలకి దాడులు ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా భారత సైన్యం ఓ పోస్ట్ పెట్టింది.
Read Also: Kethika Sharma : వారిద్దరే నా ఫేవరెట్ హీరోయిన్లు..
అలాగే, భారత ఆర్మీ టార్గెట్ చేసిన మొత్తం 9 ప్రాంతాలు ముజఫరాబాద్, కోట్లీ, బింబార్, గుల్ పూర్, మురిడ్కే, బహావల్ పూర్, సియాల్ కోట్, చాక్అమ్రూ ఉన్నాయి.. ఇందులో పాకిస్తాన్ లోని 4 ప్రాంతాలు ఉండగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 5 ప్రాంతాలను ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసింది. త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ కొనగిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ ఇస్తుంది భారత్. మరోవైపు, ఆపరేషన్ సింధూర్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారు. ఇక, భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్ సర్ ఎయిర్ పోర్టులను మూసివేశారు.