Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మంగళవారం జరిగిన అత్యున్నత భేటీలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతీకారం కోసం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బుధవారం కూడా ప్రధాని వరస మీటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే, భారత్ సైనిక చర్యకు ప్లాన్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, భారత్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తుందో అని దాయాది దేశం పాకిస్తాన్ హడలి…
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. బయటకు భారత్‌ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. తటస్థ, పారదర్శక విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటిస్తోంది.
Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకస్తాన్ భారీ ఎత్తున భద్రత కల్పిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే ప్రాక్సీ అయిన ‘‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులే. పహల్గామ్ దాడి తర్వాత భారత టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీస్ సయీద్ ఉన్నాడని తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ అతడికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం పాక్ పై దౌత్య దాడికి దిగి కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ 27లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ప్రకటించింది. వైద్య వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు గడువునిచ్చింది. దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని ‘లీవ్ ఇండియా’ నోటీసు నుంచి మినహాయించారు. స్వల్పకాలిక వీసాల 12 వర్గాలలో దేనినైనా కలిగి ఉన్న పాకిస్తానీయుల గడువు ఆదివారంతో ముగిసింది. Also…
Sabha Kamar : ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాకిస్థాన్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పహల్గాం దాడితో ప్రపంచమంతా భారత్ కు మద్దతు తెలుపుతోంది. తీవ్రవాదుల దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ సమయంలోనే పాక్ మీద భారత్ తీవ్ర ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్ నటి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పాక్ నటి సభా కమర్ మాట్లాడుతూ.. ‘మా పాకిస్థాన్ వాళ్లు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా సరే ఘోరంగా…
PM Modi: పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించడానికి భారత త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని మోడీ ఆదేశించారు.
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తున్నారు.
Pak Hackers: 26 మంది అమాయకపు టూరిస్టులను బలిగొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత, భారతీయ సైట్లపై పాకిస్తాన్ హ్యాకర్ల దాడులు పెరిగాయి. ఇండియన్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. మంగళవారం, శ్రీనగర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(APS), APS రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ (AWHO) డేటాబేస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్‌ని హ్యాకర్స్ టార్గెట్ చేశారు. "IOK హ్యాకర్"గా పనిచేస్తున్న హ్యాకర్లు ఈ వెబ్సైట్లను డీఫేస్ చేయడానికి ప్రయత్నించారు.
India Pakistan: పాకిస్తాన్‌పై భారత్ మరింత ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఇప్పటికే భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాకిస్తానీయులకు వీసాలను రద్దు చేసింది. అట్టారీ-వాఘా బోర్డర్‌ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్‌కి బిగ్ షాక్ ఇవ్వడానికి భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Pakistani Nationals: కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. పాకిస్తాన్ దేశస్థులు భారత్ ను వీడేందుకు ఈ రోజు (ఏప్రిల్ 29) చివరి రోజు..