Pak Hackers: 26 మంది అమాయకపు టూరిస్టులను బలిగొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత, భారతీయ సైట్లపై పాకిస్తాన్ హ్యాకర్ల దాడులు పెరిగాయి. ఇండియన్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. మంగళవారం, శ్రీనగర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(APS), APS రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ (AWHO) డేటాబేస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్‌ని హ్యాకర్స్ టార్గెట్ చేశారు. "IOK హ్యాకర్"గా పనిచేస్తున్న హ్యాకర్లు ఈ వెబ్సైట్లను డీఫేస్ చేయడానికి ప్రయత్నించారు.
India Pakistan: పాకిస్తాన్‌పై భారత్ మరింత ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఇప్పటికే భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాకిస్తానీయులకు వీసాలను రద్దు చేసింది. అట్టారీ-వాఘా బోర్డర్‌ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్‌కి బిగ్ షాక్ ఇవ్వడానికి భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Pakistani Nationals: కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. పాకిస్తాన్ దేశస్థులు భారత్ ను వీడేందుకు ఈ రోజు (ఏప్రిల్ 29) చివరి రోజు..
Pak Minister Asif: హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపత్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన కామెంట్స్ చేశారు.
బైసరన్ లోయను తమ ఆధీనంలోకి ఉగ్రవాదులు తీసుకుంటున్న విజువల్స్ ను అందులో చూపించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన సమయంలో తాను జిప్ లైన్లో ఉన్నానని తెలిపాడు.. ఆ వీడియోలో, నా వెనుక ఉన్న ఒక వ్యక్తి 'అల్లాహు అక్బర్' అని అరుస్తున్నట్లు మీరు చూడవచ్చు.. ఆ వెంటనే కాల్పులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నాడు.
Pakistan: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితులను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించాడు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలన్నారు.
IND vs Ban: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్‌పై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఈశాన్య భారతదేశంలోని కీలక రాజకీయ నాయకులు, పలు పార్టీలు పిలుపునిచ్చాయి.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడితో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాయాది దేశానికి భారత్ తగిన సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో పీవోకేలో గల ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తుంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్.. మరోసారి నెత్తురోడింది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి.. 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. దీని వెనక పాకిస్థాన్ ఉందని తేలిపోవడంతో దేశమంతా రగలిపోతుంది. యుద్ధం ప్రకటించి.. దాయాదికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మన సత్తా చూపాలని, పాకిస్థాన్ తిరిగి లేవకుండా.. చావ చితక్కొట్టాలని చాలామంది కోరుతున్నారు.
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు.