Pakistan PM: భారత్ మెరుపు దాడులు.. బిత్తరపోయిన పాక్ ప్రధాని
- భారత్ దాడులకు ధీటుగా సమాధానం ఇస్తాం..
- భారత్ మాపై యుద్ధాన్ని రుద్దుతుంది..
- భారత్ 5 ప్రాంతాల్లో దాడులు చేసింది: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan PM: భారత్ దాడులను పాకిస్తాన్ సైన్యం ధ్రువీకరించింది. పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ రియాక్ట్ అయ్యారు. పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ఏరియాల్లో ఈ దాడులు కొనసాగినట్లు పేర్కొనింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా, 12 మంది తీవ్రంగా గాయపడినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే, భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ అన్నారు.
Read Also: Kishan Reddy: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో తెలంగాణకు మేలు..
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
అయితే, ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాక్ట్ అయ్యారు. తమ దేశంలోని 5 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని వెల్లడించారు. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశ మొత్తం నిలబడి ఉందన్నారు. భారత్ ను ఎలా ఎదుర్కోవాలో పాక్ ఆర్మీకి తెలుసు అన్నారు. ప్రత్యర్థి ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ మా దేశంపై నెరవేరనీయం అని ఎక్స్‌లో షెహబాజ్ షరీఫ్ పోస్టు చేశారు.
Read Also: Kethika Sharma : వారిద్దరే నా ఫేవరెట్ హీరోయిన్లు..
ఇక, ఈ దాడులను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యుద్ధ చర్యలగా పేర్కొన్నారు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత భారత్- పాక్ సరిహద్దులోని పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు స్టార్ట్ చేసింది. దీనికి భారత్ సైతం కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఎల్‌వోసీ వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావారణం కొనసాగుతుంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్ లష్కరే తొయిబాకు హెడ్ క్వార్టర్స్‌గా ఉందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇక, పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్‌లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ -ఎ- మహ్మద్ స్థావరం ఉందని తేల్చింది.
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
The treacherous enemy has launched a cowardly attack on five locations within Pakistan. This heinous act of aggression will not go unpunished.
Pakistan reserves the absolute right to respond decisively to this unprovoked Indian attack — a…— Shehbaz Sharif (@CMShehbaz) May 6, 2025
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..