Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు..
- పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్..
- ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు..
- 5 ఏళ్లుగా ఐఎస్ఐతో లింకులు..
- ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Spy: భారతదేశంలో వరసగా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్న వారు పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే, పంజాబ్‌లో మరో పాకిస్తాన్ గూఢచారి దొరికాడు. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న గగన్‌దీప్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు తరన్‌తరన్‌లో అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సరిహద్దుల వెంబడి ఆర్మీ కదలికలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచారం సంస్థ ఐఎస్ఐకి అందించారనే ఆరోపణలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా సరిహద్దు వెంబడి భారత సైన్యానికి సంబంధించిన వివరాలను ఇతను పాకిస్తాన్‌కి చేరవేస్తున్నాడు.
గగన్‌దీప్ సింగ్ గత5 ఏళ్లుగా పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని, ఇతని ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(PIOలు)కి పరిచయం అయ్యాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇతడికి భారతీయ మార్గాల ద్వారా PIOల నుంచి డబ్బులు అందుకున్నాడని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మంగళవారం తెలిపారు.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
Read Also: YSRCP vs TDP: టీడీపీకి చెందిన పెళ్లి బృందంపై వైసీపీ కార్యకర్తల దాడి..!
పాకిస్తాన్ నాన్‌కానా సాహిబ్‌కి చెందిన ఖలిస్తానీ అనుకూల నాయకుడు గోపాల్ సింగ్ చావ్లా తరుచుగా భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తుంటాడు. మతపరమైన కార్యక్రమాల్లో పాకిస్తాన్‌ని సందర్శించేందుకు వచ్చే భారతీయుల్లో సాఫ్ట్ టార్గెట్స్‌ని గుర్తించే బాధ్యతను ఐఎస్ఐ చావ్లాకు అప్పగించింది. జమాత్ ఉద్ దావా, లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్‌తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి చావ్లా మొదటిసారిగా వెలుగులోకి వచ్చాడు.
జాతీయ భద్రతకు ముప్పు కలిగించే సమాచారాన్ని గగన్ ఐఎస్ఐకి అందించే వాడని, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలను పంచుకున్నట్లు దర్యాప్తులో తేలిందని డీజీపీ చెప్పారు. గగన్ గత 5 ఏళ్లుగా చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని వెల్లడించారు. పాకిస్తాన్‌కి సమాచారం అందించిన మొబైల్ ఫోన్‌ను, అలాగే 20ఎక్కువ ఐఎస్ఐ కాంటాక్ట్స్ వివరాలను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గూఢచార నెట్వర్క్‌ని ఛేదించడానికి దర్యాప్తు జరుగుతోంది. గగన్‌కి ముందు 2019లో జలంధర్ పోలీసులు భటిజా గ్రామానికి చెందిన హర్పాల్ సింగ్ పాలాను అరెస్ట్ చేశారు. ఇతను ఐఎస్ఐ ఏజెంట్ చావ్లాకు కీలకమైన వ్యూహాత్మక సమాచారాన్ని అందించారు.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!