India-Pakistan: ఇరాన్‌లో ఇండియన్స్ కిడ్నాప్ వెనక పాకిస్తాన్ హస్తం ఉందా..
- ఇరాన్‌లో భారతీయుల మిస్సింగ్ వెనక పాకిస్తాన్ హస్తం..?
- ఏజెంట్ మోసానికి గురైన ముగ్గురు యువకులు..
- ఇరాన్ మీదుగా ఆస్ట్రేలియా పంపిస్తామని మోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan: ఇటీవల ఇరాన్‌లో కనిపించకుండా పోయిన ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌లో పాకిస్తాన్ హస్తం ఉందా.? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అపహరణకు గురైన వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సంగ్రూర్‌కు చెందిన హుషాన్‌ప్రీత్ సింగ్, ఎస్‌బిఎస్ నగర్‌కు చెందిన జస్పాల్ సింగ్, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు మే 1న టెహ్రాన్‌తో దిగిన కొద్దిసేపటికి అదృశ్యమయ్యారు.
Read Also: Nara Lokesh: వాస్తవాలను మరుగున పెట్టి మాపై బురద జల్లడం సిగ్గుచేటు.. జగన్‌పై లోకేష్ ఆగ్రహం..!
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
అయితే, అదృశ్యమైన వ్యక్తుల్ని ఐఎస్ఐ భారత్ గూఢచారులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించవచ్చని నివేదిక సూచిస్తున్నాయి. బాధితులను ఇరాన్ ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతామని హామీ ఇచ్చారు. వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తులను పంజాబ్‌లోని ఓ ఏజెంట్ ఆకర్షించి దుబాయ్, ఇరాన్ ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని హామీ ఇచ్చారు. హోషియార్‌పూర్ లో ఉన్న ఈ ఏజెంట్ ప్రస్తుతం కనిపించకుండాపోయాడు. పాకిస్తాన్ ప్రభుత్వం లేదా ఐఎస్ఐతో ఏవైనా సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా దర్యాప్తు జరుగుతోంది. విదేశీ మోజులో ఉన్న యువతను తప్పుదారి పట్టించే ఒక మానవ అక్రమ రవాణా నెట్వర్క్‌ని ఈ కేసు బహిర్గతం చేస్తోంది.
ముగ్గురు అదృశ్యంపై ఇరాన్ అధికారులతో భారత అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న కుల్ భూషన్ జాదవ్‌ని ఇలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి భారత గూఢచారిగా ముద్ర వేసింది. దీంతో ఇప్పుడు ఈ ముగ్గురి అదృశ్యం సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!