Pakistan: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్లో ఇప్పుడు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపుతారో అని టెర్రరిస్టులు భయపడుతున్నారు. ఇటీవల జరగుతున్న హత్యలతో వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో ముఖ్యమైన ఉగ్రనేతలు అంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 16 మంది ఉగ్ర నేతలను గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో పాకిస్తాన్ గడ్డపైనే హతమయ్యారు. రెండేళ్లలో 18 మంది టెర్రరిస్టులు హత్యకు గురయ్యారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్…
Marriage fraud: ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారిని అని, ఎన్ఐఏ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఓ వ్యక్తి ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కాశ్మీర్ కుప్వారా జిల్లాకు చెందిన వ్యక్తి మారుపేర్లు, వేషధారణతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళల్ని మోసం చేస్తూ.. ఆరుగురిని పెళ్లి చేసుకున్నాడు, దీంతో పాటు ఇతనికి పాకిస్తాన్‌లోని పలువురితో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
Vijay Diwas: పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)కి విముక్తి కల్పించడం కోసం భారత్ 1971లో యుద్ధం చేయాల్సి వచ్చింది. తూర్పు పాకిస్తాన్లో ఏకంగా 90,000 మంది సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. ఇందిరా గాంధీ ఉక్కు సంకల్పంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. భారత్‌పై పాశ్చాత్యదేశాలు, అమెరికాలు ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా.. రష్యా భారత్‌కి అండగా నిలిచింది. 90 వేల మంది పాక్ సైనికులు భారత్ ముందు మోకరిల్లిన ఈరోజున భారత్ ‘విజయ్ దివాస్’ జరుపుకుంటుంది. యాభై రెండు…
Ayesha Omar: పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని అందరికీ తెలుసు. అక్కడ మహిళకు కూడా భద్రత లేదు. ఒంటరిగా మహిళలు కనపిస్తే కిడ్నాప్‌కి గురవ్వడం, అత్యాచారానికి గురవ్వడం అక్కడ సర్వసాధారణంగా మారింది. అయితే, తాజాగా ఆ దేశ ప్రముఖ నటి అయేషా ఒమర్ కూడా పాకిస్తాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్నాన్ ఫైసల్ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడారు.
China: డ్రాగన్ కంట్రీ చైనా తన బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. ప్రతీ విషయంలో భారత్‌ని చికాకు పెట్టేందుకే ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇటీవల సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దును సమర్థించింది. ఈ విషయంపై కూడా చైనా తన అల్ వెదర్ ఫ్రెండ్ పాకిస్తాన్‌కి మద్దతుగా నిలిచి, తన అక్కసును వెళ్లగక్కింది. ఇదిలా ఉంటే చైనా, భారత అవిభాజ్య అంతర్భాగమైన లడఖ్ ప్రాంతంపై అవాకులు చెవాకులు పేలింది.
అయితే ఈ తీర్పుపై దాయాది దేశం పాకిస్తాన్ తన అక్కసు వెల్లగక్కుతోంది. ఇప్పటికే తీర్పుకు విలువలేదని పాకిస్తాన్ అభివర్ణించగా.. దాని మిత్రదేశం చైనా, కాశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది. ఇదిలా ఉంటే పాక్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా భారత సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టారు.
Jammu Kashmir: కాశ్మీర్ సమస్యపై డ్రాగన్ కంట్రీ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని, ఆర్టికల్ 370ని రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది. అయితే ఈ తీర్పు తర్వాతి రోజే చైనా కామెంట్స్ చేసింది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్లో భారీ ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ బేస్ వద్ద మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 23 మంది మరణించారని తెలుస్తోంది. ఈ దాడిని పాకిస్తాన్ తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు జరిపినట్లుగా అధికారులు తెలుపుతున్నారు.
దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియాకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యువ జట్టు పాకిస్థాన్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం పాక్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బ్యాటింగ్ లో ఆజాన్ అవైస్ సెంచరీ (105)తో నాటౌట్ గా నిలిచాడు. ఆ…
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) అధినేత నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భారతదేశంతో సత్సంబంధాల ప్రాముఖ్యతను చెప్పినందుకు, కార్గిల్ ప్లాన్ వ్యతిరేకించినందుకు అప్పటి జనరల్ పర్వేజ్ ముషారప్ 1999లో తన ప్రభుత్వాన్ని దించేశారని శనివారం అన్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన తనను ముందస్తుగా ప్రధాని పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.