Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాదులు బయలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెర్రరిస్టులకు స్వర్గధామంగా ఉన్న పాక్‌లో జిహాదీలు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి, అత్యంత సమీపం నుంచి చంపిపారిపోవడం అక్కడ నిత్యకృత్యంగా మారింది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో ఉన్న శాంతి పరిస్థితులు పాకిస్తాన్‌కి నచ్చడం లేదు. కాశ్మీర్లో దాడులు చేసేందుకు పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదుల్ని నియంత్రణ రేఖ దాటించి భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గత రాత్రి నలుగురు ఉగ్రవాదుల్ని, భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించింది.
Poonch attack: జమ్మూ కాశ్మీర్ పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఎత్తైన ప్రాంతం నుంచి ఆర్మీ వాహనాలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు పాక్ ఆధారిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన పీఏఎఫ్ఎఫ్ పనిగా బాధ్యత ప్రకటించింది. అయితే ఈ దాడి వెనక దాయాది దేశం పాకిస్తాన్‌తో పాటు దాని ఆప్తమిత్ర దేశం చైనా ఉన్నట్లుగా నిఘావర్గాలు తెలుపాయి.
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నవాజ్, నాలుగోసారి పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని అనుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా యూకేలో ప్రవాసంలో ఉన్న నవాజ్ షరీఫ్ ఇటీవలే పాకిస్తాన్ తిరితగి వచ్చారు. తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) తరుపున ప్రచారం చేస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. తినడానికి ప్రజలకు తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పుల కోసం విదేశాల చుట్టూ తిరగడమే అక్కడి రాజకీయ నాయకులు, అధికారులకు నిత్యకృత్యమైంది. విద్యుత్, గ్యాస్, పెట్రోల్ ఇలా అన్నింటిపై విపరీతంగా పన్నులు పెంచింది అక్కడి ప్రభుత్వం. ఇదిలా ఉంటే అక్కడి ఆటోమొబైల్స్ పరిశ్రమ కూడా దెబ్బతింది.
Pakistan: పాకిస్తాన్ దేశంలో వరసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రావడం, ఉగ్రవాదిని పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపేసి అంతే వేగంతో మాయమవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు భారత వ్యతిరేక ఉగ్రవాదులు 19 మంది ఇలాగే చనిపోయారు. ఆదివారం రోజు లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన కీలక ఉగ్రవాది హబీబుల్లాని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో కాల్చి చంపారు.
పాకిస్థాన్ దివాలా తీయడానికి కారణం భారత్, అమెరికా దేశాలు కారణం కాదని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. మన దరిద్రానికి మనమే కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మన కాళ్లను మనమే నరుక్కున్నామంటున్నామని పరోక్షంగా మిలట్రీపై తీవ్ర విమర్శలు విమర్శలు గుప్పించారు.
భారతదేశపు అతిపెద్ద శత్రువు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందన్న వార్త తర్వాత సోషల్ మీడియాలో అనేక వాదనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో తలదాచుకున్న దావూద్ విషప్రయోగం చేశారన్న ఆరోపణలతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ట్విట్టర్ వేదికగా చాలా మంది దావూద్‌కు విషప్రయోగం చేశారని, ఆ తర్వాత అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని పేర్కొన్నారు.
సోమవారం లడఖ్‌లోని కార్గిల్‌లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.