Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి వరసగా అక్కడి కోర్టులు శిక్షల్ని విధిస్తున్నాయి. తాజాగా ఇస్లామిక్ పద్ధతులకు విరుద్ధంగా వివాహం చేసుకున్నాడనే కేసులో ఆయనకు, అతని భార్య బుష్రా బీబీకి పాక్ కోర్టు శనివారం 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2022 నుంచి ఇది ఇమ్రాన్ ఖాన్‌పై నాలుగో ఆరోపణ. అయితే, రెండు వరస వివాహాల మధ్య తప్పనిసరిగా విరామం (ఇద్దత్) పాటించాలనే ఇస్లామిక్ ఆచారాన్ని ఆరోపిస్తూ బుష్రా బీబీ మొదటి భర్త ఖవార్ మనేకా కేసు నమోదు చేశాడు.
Read Also: Uttar Pradesh: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుందని.. ప్రియురాలి గొంతు నులిమి చంపిన వ్యక్తి..
మనేకా తన మాజీ భార్య, ఇమ్రాన్ ఖాన్ పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నారని, రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించే నేరాన్ని కూడా ఆరోపించారు. రావల్పిండిలోని ఆడియాల జైలు ప్రాంగణంలో శుక్రవారం 14 గంటల పాటు విచారణ జరిగింది. ఈ రోజు సివిల్ జడ్జి ఖుద్రతుల్లా ఈ రోజు తీర్పును ప్రకటించారు. ఇద్దరు రూ. 5 లక్షల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించారు. తీర్పు వెలువరించిన సమయంలో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ ఇద్దరు కోర్టు హాలులోనే ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఈ వారం ప్రారంభంలో ఇమ్రాన్ ఖాన్‌ని సైఫర్ కేసులో 10 ఏళ్లు, తోషాఖానా అవినీతి కేసులో 14 జైళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది ఆగస్టు నెలలో ఇమ్రాన్ ఖాన్‌ని తోషాఖానా కేసులో దోషిగా నిర్ధారించబడిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను జైలులోనే ఉంటున్నాడు. ఇస్లామిక్‌కి విరుద్ధంగా పెళ్లి చేసుకున్నాడనే కేసులో దోషిగా తేలిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ..తనను, తన భార్యను అవమానించడానికే ఇలా చేశారని అన్నారు. ఇస్లాంలో, ఇద్దత్ అనేది ఒక స్త్రీ విడాకులు తీసుకున్న తర్వాత లేదా తన భర్త మరణం తర్వాత తప్పక పాటించవలసిన ఒక నిర్దిష్ట కాలం మరియు ఆ సమయంలో ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకోకూడదని భావిస్తున్నారు.