India: పాకిస్తాన్లో గత కొంత కాలంగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్లో మరణిస్తున్న ఉగ్రవాదులంతా భారత్కి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులని, వారు భారత న్యాయ వ్యవస్థను ఎదుర్కోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం అన్నారు.
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు ఉత్తరప్రాంతానికే పరిమితమైన యుద్ధం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ యుద్ధంలో, హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియే పాకిస్తాన్ మద్దతు కోరారు. పాకిస్తాన్ దేశాన్ని ధైర్యవంతుడిగా కొనియాడుతూ.. ఇజ్రాయిల్ పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటే, ఆ దేశ క్రూరత్వం ఆడిపోతుందని చెప్పినట్లు ఆ దేశ జియో న్యూ్స్ బుధవారం నివేదించింది.
Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను మళ్లీ భారత్పై విషం చిమ్మారు. ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తనను చంపడానికి కుట్ర విఫలమైన తర్వాత, డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని ఇందులో చెప్పాడు.
India-Pak: ఇటీవల కాలంలో పాకిస్తాన్ యువతులు, ఇండియన్ అబ్బాయిలకు పడిపోతున్నారు. తాజాగా ఓ పాకిస్తాన్ యువతి ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు వచ్చింది. కోల్కతాకు చెందిన వ్యక్తి సమీర్ ఖాన్ని పెళ్లి చేసుకునేందుకు కరాచీకి చెందిన యువతి జవేరియా ఖానుమ్ భారత్ వచ్చింది.మంగళవారం వాఘా-అట్టారీ అంతర్జాతీయ సరిహద్దు నుండి భారతదేశానికి చేరుకుంది.. వచ్చే ఏడాది జనవరిలో వీరిద్దరి వివాహం నిశ్చయమైంది. కాబోయే కోడలికి భర్త సమీర్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.
Khalistani terrorist: భింద్రన్వాలే మేనల్లుడు ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ పాకిస్తాన్లో మరణించాడు. భారత వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడుతున్న ఇతను చాలా కాలంగా పాకిస్తాన్లోనే ఉంటున్నాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక, ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నాడు. ఇతనికి పాక్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Pakistan: పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల రహస్య హత్యల మధ్య ప్రధాన సమాచారం వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ టెర్రరిస్ట్, లష్కర్ కమాండర్ సాజిద్ కూడా ఆసుపత్రిలో చేరాడు.
Pakistan Terrorist Attack: పాకిస్థాన్లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని కారకోరం హైవేపై ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కనీసం 10 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు.
Pakistan: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముక్యంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాటు మరికొన్ని ఉగ్రసంస్థలు అక్కడి పోలీస్ అధికారులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నాయి. టీటీపీకి మంచి పట్టున్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా, వజీరిస్తాన్ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది.
రాయ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 నాలుగో మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ప్లేయర్లు సమష్టిగా రాణించడంతో.. ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించింది యంగిస్థాన్. మరో మ్యాచ్ ఉండగానే.. 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో టీ 20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది..