టీ20 క్రికెట్లో ఈరోజు టీమిండియా ఓ రికార్డు నెలకొల్పే సమయం వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిస్తే.. అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు గెలిచిన రేసులో పాకిస్తాన్‌ను వెనక్కి నెడుతుంది. ప్రస్తుతం ఇండియా-పాకిస్తాన్ సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్, పాకిస్తాన్‌లు 135-135 మ్యాచ్ ల్లో గెలుపొందాయి. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ ను దాటి ముందడుగు వేసేందుకు ఈరోజు మంచి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 226 టీ20 మ్యాచ్‌లు…
Anju Love Story: పాకిస్తాన్ వ్యక్తితో ప్రేమలో పడి అతని కలిసేందుకు వెళ్లిన అంజూ అనే మహిళ గురించి దేశం మొత్తం చర్చించింది. ఇలా వెళ్లిన అంజూ, ఆ దేశంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నివసిస్తున్న స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. అంతే కాకుండా ముస్లిం మతాన్ని స్వీకరించి తన పేరు ఫాతిమాగా మార్చుకుంది.
పాకిస్తాన్‌లోని అకౌంటబిలిటీ కోర్టు సోమవారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతేకాకుండా.. రిమాండ్‌ను పొడిగించాలని ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు న్యాయమూర్తి ముహమ్మద్ బషీర్ రావల్పిండిలోని అడియాలా జైలులో అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసును విచారించినట్లు అక్కడి ఓ వార్తాపత్రిక తెలిపింది.
India-Pakistan: ఈ ఏడాడి జూలై నెలలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజూ అనే 34 ఏళ్ల యువతి తన ఫేస్బుక్ ఫ్రెండ్‌ని కలుసుకునేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఆ సమయంలో ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్‌లోనే తన స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. అంజూ ఇస్లాంలోకి మారినట్లు పాక్ మీడియా వెళ్లడించింది. అప్పటి నుంచి ఈ జంట పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నివాసం ఉంటున్నారు.
Indian Navy : హిందూ మహాసముద్రంలో భారత నావికాదళ బలం నిరంతరం పెరుగుతోంది. ఈ సిరీస్‌లో నౌకాదళం త్వరలో తన యుద్ధనౌకల కోసం మీడియం కెపాసిటీ గల యాంటీ మిస్సైల్/యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ పాయింట్ డిఫెన్స్ సిస్టమ్‌ను పొందబోతోంది.
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ను ఆదుకునేందుకు యూఏఈ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్లో యూఏఈ 20-25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కకర్ సమావేశమైన తర్వాత ఈ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
Honour killing: ఇస్లాం ప్రాతిపదికగా ఏర్పడిన పాకిస్తాన్లో కొందరు మతఛాందసవాదాన్ని తలకెక్కించుకుంటున్నారు. దీంతో అక్కడ అమ్మాయిలు, మహిళల స్వేచ్ఛకు పరిమితులు ఉంటున్నాయి. ఇదే కాకుండా పరువు హత్యల విషయంలో పాకిస్తాన్ టాప్ పొజిషన్లో ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న, ప్రేమించుకుంటున్న అక్కడ అమ్మాయిలను సొంత బంధువులు, కుటుంబ సభ్యులే క్రూరంగా హత్య చేస్తున్నారు.
Pakistan pacer Hasan Ali wishes to play in IPL: ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ లీగ్ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (ఐపీఎల్). ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లు కుమ్మరించే ఈ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. ఐపీఎల్లో ఒక్కసారైనా ఆడితే చాలనుకునే ఎందరో విదేశీ స్టార్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. లీగ్‌లో భాగమయ్యేందుకు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు సైతం తమ దేశానికి ఆడే…
గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 'స్వయం సమృద్ధి భారతదేశం' అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రపంచానికి లౌకికవాదాన్ని బోధించాల్సిన అవసరం లేదని అన్నారు.
Spying: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) అరెస్ట్ చేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఇద్దరు వ్యక్తులు టెర్రర్ ఫైనాన్సింగ్‌కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పంజాబ్‌లోని భటిండాకు చెందిన అమృత్ గిల్ అలియాస్ అమృత్ పాల్ (25), ఘజియాబాద్‌లోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో నివసిస్తున్న రియాజుద్దీన్ (36)లను ATS అరెస్టు చేసింది.