రాజకీయ నాయకుల జీవితకాల అనర్హత నిషేదం కేసును ఇవాళ విచారిస్తామని పాకిస్థాన్ సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్), ఎన్నికల చట్టం 2017కి సవరణ ప్రకారం అనర్హత కాలానికి సంబంధించిన అన్ని వివాదాలను చీఫ్ జస్టిస్ ఖాజీ ఇసా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేయనుంది.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న కిష్త్వార్ జిల్లాకు చెందిన 23 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్న నేరస్థులుగా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ కోర్టు. అందుకు సంబంధించి పోలీసులు సమాచారం ఇచ్చారు. దోడాలోని ప్రత్యేక UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) కోర్టు ఈ ఉగ్రవాదులపై నమోదైన కేసులకు సంబంధించి తమ ముందు హాజరు కావడానికి ఒక నెల సమయం ఇచ్చిందని, లేకపోతే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని అధికారులు తెలిపారు.
TikTok: పాకిస్తాన్ దేశంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారామ్ టిక్‌టాక్ వివాదాస్పదమవుతోంది. అక్కడి యువత టిక్‌టాక్ బారిన పడుతోంది. ఇదిలా ఉంటే అక్కడి మతపెద్దలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇస్లాంకు విరుద్ధమని ఫత్వాలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టిక్ టాక్ వివాదం ఇద్దరు అక్కాచెల్లిళ్ల మధ్య గొడవకు కారణమైంది. 14 ఏళ్ల బాలిక, మరో సోదరిని కాల్చి చంపింది. ఈ వివాదం పాకిస్తాన్ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
పాకిస్థాన్‌లో 2024 నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ సారి నూతన సంవత్సర వేడుకలను చేసుకోకూడదని పాకిస్థాన్ నిర్ణయించింది.
ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోటీ చేయగలరా.. అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేయకుండా నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టు జీవితకాల నిషేధం విధించింది.
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు., ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జమ్మూ కాశ్మీర్లో సైన్యంపై ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల ప్రకారం.. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు సైన్యంపై దాడి చేయడానికి చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నాయి.
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే, గాజా, పాలస్తీనాకు ఎదురైన గతినే కాశ్మీర్ ఎదుర్కొంటుందని అన్నారు.
పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా మారాయి.. చాలా దయనీయంగా మారింది.. తినడానికి తిండి కూడా లేకుండా చాలా మంది ఆకలితో చనిపోతున్నారు.. ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. పౌష్టికాహరం కోసం ఒక్క గుడ్డును కొనాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా ఒక్క గుడ్డు ధర రూ.32కు చేరుకుంది. దీంతో, గుడ్డు కొనాలంటే అక్కడి జనాలు బేంబేలెత్తిపోతున్నారు.. పాకిస్తాన్ లో నిత్యావసర వస్తువుల పై కూడా ధరలు పైపైకి చేరుతున్నాయి..…
ఉగ్రదాడి సూత్రధారి, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) పాకిస్థాన్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని పాక్ ఆంగ్ల దినపత్రిక డాన్ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్‌లోని ప్రతి జాతీయ, ప్రావిన్సు అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థులను నిలబెట్టినట్లు సమాచారం.