Shahid Afridi: దుబాయ్‌లో కేరళ గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి అతిథులుగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ రావడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దుబాయ్‌లోని కేరళ కమ్యూనిటీపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వ్యతిరేకి అయిన షాహిద్ అఫ్రిదిని ఆహ్వానించడంపై భారత సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో నష్టాల గురించి తొలిసారిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ స్పందించారు. నాలుగు రోజులు సంఘర్షణ అణుయుద్ధం స్థాయికి చేరుకోలేని ఆయన చెప్పారు. భారత ఫైటర్ జెట్స్ కూలిపోయాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ విషయం ఏంటంటే, జెట్ కూలిపోవడం కాదు, కానీ అవి ఎందుకు కూలిపోతున్నాయనేదే ముఖ్యం’
PM Modi: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని శుక్రవారం బీహార్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాలను ప్రస్తావిస్తూ, పాకిస్తాన్ నీటి సమస్యపై ఎప్పుడూ రాజీపడదని అన్నారు. ఎందుకంటే, దేశంలో 24 కోట్ల మంది ప్రజల ప్రాథమిక హక్కులతో ఇది ముడిపడి ఉందని చెప్పారు. గురువారం, పాకిస్తాన్‌లోని పలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్, ప్రిన్సిపాల్స్, ఇతర ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. మే 7న జరిగిన ఈ దాడులకు సంబంధించి కొత్త ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ దాడులను ‘‘ఆపరేషన్స్ రూమ్’’ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులు పర్యవేక్షిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.
ఇస్తాంబుల్‌లోని డోల్మాబాహ్స్ వర్కింగ్ ఆఫీస్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి మహ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం క్లోజ్డ్ రూమ్ లో జరిగింది. ఈ సమావేశానికి తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్, రక్షణ మంత్రి యాసర్ గులెర్ కూడా హాజరైనట్లు ఎర్డోగన్ కార్యాలయం తెలిపింది. ఉగ్రవాదంపై భారత్ చర్య తీసుకున్న తర్వాత, పాకిస్తాన్…
NDA: ఆదివారం ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాయుధ దళాల పరాక్రమాన్ని, ప్రధాని నరేంద్రమోడీ ధైర్యమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
BJP MP: పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పలువురు రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా పహల్గామ్ ఉగ్రదాడిపై చేసిన కామెంట్స్‌పై వివాదం చెలరేగింది. ఉగ్రవాద దాడి సమయంలో మహిళలు తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులుగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఉండాల్సిందని ఆయన అనడం రాజకీయ దుమారాన్ని రేపింది.
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ తీరును భారత్ ఎండగట్టింది. ఉగ్రవాద దాడుల్లో 20,000 మంది భారతీయులు మరణించారని భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు గుప్పించింది.