S Jaishankar: భారత్ ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదని, న్యూఢిల్లీ ఎప్పటికీ అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం అన్నారు. జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుత్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత, పాక్ మధ్య వ్యవహారం ద్వైపాక్షికం అని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని అన్నారు.
Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాశవికంగా లష్కరేతోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఈ చర్యల తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పాక్, పీఓకేలోని భూభాగాల్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ దాడిలో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఇప్పుడు పాకిస్తాన్‌ని భయపెడుతున్న అంశం సింధు జల ఒప్పందం నిలిపివేత.
IndiGo Incident: బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విపరీతమైన వడగళ్ల వాన, దట్టమైన మేఘాల్లో చిక్కుకున్న విమానం అత్యంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు పైలట్లు విజయవంతంగా విమానాన్ని శ్రీనగర్‌లో ల్యాండ్ చేయడంతో అందులోని 220 మంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదకరమైన వాతావరణం నుంచి బయటపడటానికి ఇండిగో పైలట్లు లాహోర్ ఏటీసీని సంప్రదించినప్పటికీ, పాకిస్తాన్ తమ ఎయిర్‌స్పేస్ ఉపయోగించుకోవడానికి అనుమతించలేదు. పాకిస్తాన్ తీరు వల్ల 220…
Airspace ban: పాకిస్తాన్ విమానాలకు భారత గగనతల నిషేధాన్ని కేంద్రం జూన్ 23 వరకు, అంటే మరో నెల పాటు పొడగించింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు లీజు తీసుకున్న, వాటి యాజమాన్యం కింద నడపబడుతున్న విమానాలతో పాటు సైనిక విమానాలు భారత ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించకుండా బ్యాన్ విధించారు.
India Pakistan: పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద భాష మారడం లేదు. భారత్‌ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా, పాక్ ఎయిర్ ఫోర్స్ ఆస్తుల్లో 20 శాతాన్ని కోల్పోయినా ఆ దేశానికి బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదులు మాట్లాడే భాషలోనే అక్కడి ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నారు.
IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బలమైన వడగళ్ల వానను తట్టుకుని పైలట్ విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్‌లో ల్యాండ్ చేశారు. ఢిల్లీ నుంచి 220 మంది ప్రయాణికులతో శ్రీనగర్ వెళ్తున్న విమానం బలమైన టర్బులెన్స్‌కి గురైంది. బుధవారం, ఇండిగో A321 నియో విమానం 6E 2142 పఠాన్‌కోట్ సమీపంలో వడగళ్ల తుఫాను,తీవ్రమైన టర్బులెన్స్‌ని ఎదుర్కొంది.
Trump: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, అణు యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే, పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరడంతోనే తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. తాజాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారు.
పాక్ ప్రయోగించిన లైవ్ షెల్ ఒకటి పూంఛ్‌లో రోడ్డు పక్కన ఉండటాన్ని ఈరోజు (మంగళవారం) గ్రామస్తులు గుర్తించారు. ఆ విషయాన్ని భారత సైనిక అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆ లైవ్ షెల్ ను పేల్చేశాయి.
బీటీంగ్ రిట్రీట్ సమయంలో పాకిస్తానీ వైపు ఉన్న బోర్డర్ గేట్లు తెరవబోమని భారత అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో కరచాలనం చేయడం జరగదని తేల్చి చెప్పారు. కానీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రోగ్రం జరగబోతుంది.
పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. భారతదేశం ఇజ్రాయెల్ కాదు.. పాకిస్తాన్ పాలస్తీనా కాదని అన్నారు. అలాగే, కాశ్మీర్ అంశంపై కూడా అతడు భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు.