జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్‌కి చెందిన అనేక సైనిక, ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. మే 6-7 రాత్రి నుంచి మే 10 వరకు భారత వైమానిక దళం (IAF) జరిపిన దాడుల్లో పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 6 పీఏఎఫ్ యుద్ధ విమానాలు, 2 AWACS, 1 C-130 విమానం, 30 క్షిపణులు, అనేక డ్రోన్లు (UCAV)లు ధ్వంసమయ్యాయని ఆపరేషన్‌లో పాల్గొన్న వర్గాలు ఇండియా టుడేకు తెలిపాయి.
READ MORE: Food Poison : ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో ఫుడ్‌పాయిజన్.. ఒకరు మృతి.. 30 మందికి అస్వస్థత..
మూలాల ప్రకారం.. ఈ లక్ష్యాలన్నింటినీ సుదర్శన్ వైమానిక క్రూయిజ్ క్షిపణి, ఉపరితలం నుంచి గగనతల క్షిపణుల సహాయంతో ఛేదించారు. సుదర్శన్ క్షిపణి 300 కి.మీ దూరం నుంచి ఖచ్చితమైన దాడిని నిర్వహించింది. పాకిస్థాన్ భోలారి వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో స్వీడిష్ AEW&C విమానం (ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్) కూడా ధ్వంసమైంది. వైమానిక స్థావరంలో అనేక యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే, శిథిలాలను పాకిస్థాన్ తొలగించింది.
READ MORE: TTD : అలర్ట్.. తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో జారీ చేసే టోకెన్ల కౌంటర్‌లో మార్పు..
పాకిస్థాన్ పై భార్ కేవలం వైమానిక ప్రయోగ క్రూయిజ్ క్షిపణులను మాత్రమే ఉపయోగించింది. ‘వింగ్ లూంగ్’ సిరీస్‌కు చెందిన అనేక మీడియం-ఎలిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ చైనీస్ డ్రోన్‌లు రాఫెల్, ఎస్-30 దాడులలో ధ్వంసమయ్యాయి. భారత్ చేతిలో ఓటమి అనంతరం పాక్ కాల్పుల విరమణ కోసం అభ్యర్థించింది. ఆ తర్వాత భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే, భవిష్యత్తులో ఏదైనా దుర్మార్గపు చర్యకు పాల్పడితే మరిన్ని చర్యలు తీసుకుంటామని భారతదేశం పాకిస్థాన్‌ను హెచ్చరించింది.