IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బలమైన వడగళ్ల వానను తట్టుకుని పైలట్ విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్‌లో ల్యాండ్ చేశారు. ఢిల్లీ నుంచి 220 మంది ప్రయాణికులతో శ్రీనగర్ వెళ్తున్న విమానం బలమైన టర్బులెన్స్‌కి గురైంది. బుధవారం, ఇండిగో A321 నియో విమానం 6E 2142 పఠాన్‌కోట్ సమీపంలో వడగళ్ల తుఫాను,తీవ్రమైన టర్బులెన్స్‌ని ఎదుర్కొంది.
Trump: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, అణు యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే, పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరడంతోనే తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. తాజాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారు.
పాక్ ప్రయోగించిన లైవ్ షెల్ ఒకటి పూంఛ్‌లో రోడ్డు పక్కన ఉండటాన్ని ఈరోజు (మంగళవారం) గ్రామస్తులు గుర్తించారు. ఆ విషయాన్ని భారత సైనిక అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆ లైవ్ షెల్ ను పేల్చేశాయి.
బీటీంగ్ రిట్రీట్ సమయంలో పాకిస్తానీ వైపు ఉన్న బోర్డర్ గేట్లు తెరవబోమని భారత అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో కరచాలనం చేయడం జరగదని తేల్చి చెప్పారు. కానీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రోగ్రం జరగబోతుంది.
పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. భారతదేశం ఇజ్రాయెల్ కాదు.. పాకిస్తాన్ పాలస్తీనా కాదని అన్నారు. అలాగే, కాశ్మీర్ అంశంపై కూడా అతడు భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు.
పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం పూనుకుంది. ఇందుకోసం ఆయా దేశాలు వెళ్లేందుకు బృందాలను ఏర్పాటు చేశాయి. అయితే ఎంపీల పేర్లు ఇవ్వాలంటూ ఆయా పార్టీలకు కేంద్రం లేఖలు రాసింది.
దేశ ద్రోహానికి పాల్పడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హాత్రాకు సంబంధించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కస్టడీలో ఉన్న జ్యోతిని అధికారులు విచారిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులను ఏరిపారేసేందుకు సెర్చ్ ఆపరేషన్ ను ఇండియన్ ఆర్మీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
YouTuber Jyoti Malhotra: హర్యానాలోని హిస్సార్‌కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసిన కేసులో అరెస్ట్ అయింది. ఈ నేపథ్యంలో విచారణలో కీలక విషయాలను తెలిపినట్లు హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు మల్హోత్రా అనేక సార్లు పాకిస్తాన్, చైనాను సందర్శించారని వెల్లడించారు.
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ తరుఫున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ దర్యాప్తులో ఈమె పాకిస్థానీ కుట్ర బయటపడింది. సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి దేశాన్ని మోసం చేసేలా యూట్యూబర్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.