SA vs NZ Semi Final 2026: చరిత్ర న్యూజిలాండ్‌ది, ఫామ్ దక్షిణాఫ్రికాది.. ఈడెన్‌లో ఐకానిక్ విజయం ఎవరిదో!
- నేడు దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్
- ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం
- చరిత్ర న్యూజిలాండ్‌ది, ఫామ్ దక్షిణాఫ్రికాది
- ఈడెన్‌లో ఐకానిక్ విజయం ఎవరిదో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీ ఫైనల్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇందుకు కారణం.. ఒకవైపు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఆధిపత్యం ఉండగా, మరోవైపు ప్రస్తుత టోర్నీలో అద్భుత ఫామ్‌లో దక్షిణాఫ్రికా ఉండడమే. దీంతో ఈ సమరం నిజంగానే ఐకానిక్‌గా మారనుంది.
2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా సఫారీలను కివీస్ కట్టడి చేసి ఫైనల్ చేరింది. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో కూడా న్యూజిలాండ్ విజయం సాధించి నాకౌట్ మ్యాచ్‌లలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇలా కీలక దశల్లో సౌతాఫ్రికాపై కివీస్‌కు ఆధిక్యం ఉంది. అయితే ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది.
Also Read
- World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
- Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
- Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్ కప్ 2026లో దక్షిణాఫ్రికా జట్టు దుర్భేద్యంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ సెమీస్‌కు చేరుకుంది. కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకుని గెలిచే సామర్థ్యాన్ని సఫారీ జట్టు ప్రదర్శిస్తోంది. న్యూజిలాండ్ విషయానికి వస్తే.. నాకౌట్ మ్యాచ్‌లలో వారి అనుభవం, సమయోచిత వ్యూహాలు ఎప్పుడూ ప్రత్యేకం. ఒత్తిడిని జయించడమే కివీస్‌కు బలంగా నిలుస్తుంది. గత చరిత్ర వారికి ధైర్యాన్నిస్తే.. ప్రస్తుత ఫామ్ దక్షిణాఫ్రికాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది.
మొత్తానికి చరిత్ర న్యూజిలాండ్ వైపు ఉంటే.. ఫామ్ దక్షిణాఫ్రికా వైపు ఉంది. ఈడెన్ వేదికగా ఈ రెండు బలమైన జట్లు తలపడుతున్న ఈ పోరు అభిమానులకు అసలైన క్రికెట్ థ్రిల్ అందించనుంది. ఎవరు ఫైనల్ బెర్త్ సాధిస్తారో చూడాలి. టాస్ సాయంత్రం 6.30కు పడనుండగా.. మ్యాచ్ 7 గంటలకు మొదలవనుంది.
తాజావార్తలు
-
Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
-
Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!