Pakistan: పాకిస్తాన్‌కు ఉగ్రవాదానికి ఉన్న సంబంధాలను బయటపెట్టుకోవడంలో ఆ దేశం ఎప్పుడూ సిగ్గుపడటం లేదు. తాజాగా, పహల్గామ్ ఉగ్రవాడికి బాధ్యత వహించిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’’కు మద్దతు తెలుపుతోంది. ఏకంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీశాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో నాన్-పర్మినెంట్ సభ్యుడిగా ఉన్న పాకిస్తాన్, పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూనే, ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ప్రస్తావనను నిరోధించింది.
Operation Sindoor: పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’తో విరుచుకుపడింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ అయిని మురిడ్కే, బహవల్‌పూర్ కూడా ఉన్నాయి. 100 మందికిపైగా టెర్రరిస్టులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పైకి దాడులు ప్రారంభించింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ మారణహోమానికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ టీఆర్ఎఫ్ ను ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’ (FTO), ప్రత్యేకంగా నియమించబడిన ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ (SDGT)గా ప్రకటించింది. కాశ్మీర్ రెసిస్టెన్స్ అని కూడా పిలువబడే రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా భావిస్తున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ భారత్, పాశ్చాత్య దేశాలలో దాడులకు…
Asaduddin Owaisi: ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు, పార్లమెంటరీ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలోని బోధన్ పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితాలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీలు ఉన్నట్టు గుర్తించగలగినప్పుడు.. పహల్గాంలో 26 మంది హిందూ పర్యాటకులను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదుల్ని ఎలా కనుగొనలేకపోయారని ప్రశ్నించారు. Work From…
పహల్గామ్ ఉగ్ర దాడి యావత్తు దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కలవరపాటుకు చేసింది. నలుగురు ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలేసి భర్తలను చంపేశారు. ఇలా 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇక ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం చైనాకు వెళ్లారు.
Pakistan: భారతదేశాన్ని ఇన్నాళ్లు పాకిస్తాన్ ‘‘అణు బెదిరింపులకు’’ పాల్పడేది. అయితే, ఆపరేషన్ సిందూర్‌తో ఈ పరిస్థితిని భారత్ మార్చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడుల్ని దేశంపై యుద్ధంగానే చూస్తామని, ఇకపై అణు బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంగా పాకిస్తాన్‌కు తెలియజేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ అణ్వాయుధాలకు కేంద్రంగా ఉన్న పలు ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది.
Indian Army: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో మాత్రమే కాకుండా మొత్తం ముగ్గురు శత్రువలతో పోరాడామని మిలిటరీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(కాపబిలిటీ డెవలప్మెంట్ అండ్ సస్టెన్స్) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ అన్నారు. ఇటీవల, పాకిస్తాన్‌తో జరిగిన ఉద్రిక్తత గురించి వివరణ ఇచ్చారు.
Pakistan YouTube Ban: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు అన్నింటినీ భారత దేశంలో బ్యాన్ చేసింది.
Quad: భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది. క్వాడ్ గ్రూప్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్వాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రులు కోరారు.