Operation Sindoor: భారత్ చెప్పింది తక్కువే.. “సిందూర్”లో పాకిస్తాన్‌కి తీవ్ర నష్టం..
- ఆపరేషన్ సిందూర్ గురించి భారత్ చెప్పింది తక్కువే..
- భారత్ పేర్కొన్న దాని కన్నా ఎక్కువ లక్ష్యాలపై దాడి..
- పాకిస్తాన్ పత్రాల్లో కీలక విషయాలు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం చెప్పిన దాని కన్నా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు ఆ దేశ పత్రాలు బయటపెట్టాయి. భారత్ పేర్కొన్న దాని కన్నా అదనంగా మరో 8 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు చెప్పింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్, పీఓకే లోని 09 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో లష్కరే, జైషే మహ్మద్‌కి చెందిన 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఈ దాడులకు ప్రతీకారంగా పాక్ సైన్యం డ్రోన్లతో భారత్‌పై దాడులకు తెగబడింది. దీని తర్వాత, భారత్ పాకిస్తాన్‌లోని పలు వైమానిక స్థావరాలపై దాడులు చేసింది.
Read Also: PM Modi: రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఈ దాడుల గురించి భారత సైన్యం మీడియా బ్రీఫింగ్‌లో వెల్లడించింది. అయితే, భారత్ చెప్పిన దాడి కన్నా తమకు ఎక్కువ నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ ‘‘ఆపరేషన్ బన్యన్ ఉన్ మర్సూస్’’ పత్రాల్లో వెల్లడించింది. భారత సైన్యం పేర్కొన్న దాని కన్నా మరో 8 లక్ష్యాలపై దాడులు జరిగినట్లు ఇందులో పేర్కొంది. పాకిస్తాన్ పత్రాల్లో పెషావర్, ఝాంగ్, సింధ్‌లోని హైదరాబాద్, పంజాబ్‌లోని గుజరాత్, గుజ్రాన్‌వాలా, భవల్‌నగర్, అటాక్,చోర్‌లపై దాడులు జరిగినట్లు చెప్పింది. భారత సైన్యం ప్రెస్ బ్రీఫింగ్‌లో ఈ ప్రదేశాలను పేర్కొనలేదు. దీనిని బట్టి చూస్తే భారత్ చెప్పిన దాని కన్నా పాకిస్తాన్‌లో మరింత విధ్వంసం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఎందుకు భారత్‌ని కాల్పుల విరమణకు అభ్యర్థించిందనేది దీనిని చూస్తే అర్థమవుతుంది.
భారత సైన్యం పాకిస్తాన్, పీఓకేలోని బహవల్ పూర్, మురిడ్కేలతో పాటు ముజఫరాబాద్, కోట్లి, రావలకోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం మరియు చక్వాల్ ఉగ్రస్థావరాలన నాశనం చేసింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం దాడులకు ప్రతీకారంగా, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన 11 వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. భారత దాడుల్లో నూర్ ఖాన్, రఫికి, మురిద్, సుక్కూర్, సియాల్‌కోట్, పస్రూర్, చునియన్, సర్గోధా, స్కారు, భోలారి మరియు జకోబాబాద్ ఎయిర్ బేస్‌లు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!