టీఆర్ఎస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీని, నన్ను అవమానకరంగా తిట్టారని, పేదలకు బియ్యం అందకుండా అన్యాయం చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్లు, బియ్యం సేకరణ చేయాలని ఎఫ్ సీ ఐని ఆదేశించినట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. పేదలకు బియ్యం అందకుండా చేసిందని.. ఏప్రిల్, మే నెలల్లో బియ్యం ఇవ్వకుండా పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్నాడని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. యాసంగి వడ్లను కొనిపించే బాధ్యత తనదని, రైతులు వరి వేయాలని కోరిన బండి సంజయ్.. ఆ తరువాత మొహం చాటేశారన్నారు. ఆయన ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం చూస్తుంటే నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుందని ఆగ్రహం వ్యక్తం…
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. కొనుగోళ్లు చేయకుండా కనీస మద్దతు ధర అంటే ఏం లాభం అని ప్రశ్నించారు. తెలంగాణ పచ్చగా ఉండటం చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కావాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. 2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచినత బియ్యం అందిస్తున్నామని..90 లక్షల కార్డుల్లో 53 లక్షల మందికి మాత్రమే బియ్యాన్ని అందించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరికి…
తెలంగాణకు మాటలు, గుజరాత్ కు మూటలు దక్కతున్నాయని మంత్రి హరీష్ రావు బీజేేపీ పార్టీపై ఫైర్ అయ్యాడు. నర్సాపూర్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో అదికారంలోకి వస్తే ఆర్టీసీని అమ్ముతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలపై బీజేపీ పాలసీ ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు…
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇటీవల ఆకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో ఆరుగాలం శ్రమించిన రైతన్నకు నిరాశే మిగిలింది. అయితే.. తాజాగా మరోసారి తెలంగాణకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రి హరీష్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రావొద్దని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో…
ధాన్యం కొనుగోళ్లు ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని అంబేద్కర్ భవన్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా జిల్లాలో మొత్తం 43 రైస్ మిల్లులు ఉండగా.. అందులో 10 బాయిల్డ్.. 33 రా…
ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 30 జిల్లాల్లో 5299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాటికి 76,495 మంది రైతులనుంచి రూ. 1483 కోట్ల విలువ చేసే 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన వెల్లడించారు.…
అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండిసంజయ్ లేఖ రాశారు. వరిధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నా మీ ప్రభుత్వం దున్నపోతుపై వాన పడ్డ చందంగా వ్యవహరించిందని అన్నారు. 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 74 లక్షల మెట్రిక్…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.. ఇప్పటికే 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు అధికారులు.. ఇక, రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా ఏవిధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 61,300…