కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువ కాకుండా వరిని కొనుగోలు చేయాలని కలెక్టర్ సి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బోర్గావ్, మోపాల్, నర్సింగ్ పల్లి, కస్బాగ్ తండా, బాడ్సి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ప్రతి రైతు పండించిన పంటకు మంచి ధర వచ్చేలా కృషి చేయాలని సూచించారు. బోర్గావ్, మోపాల్, నర్సింగ్ పల్లి, కస్బాగ్ తండా, బాడ్సి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు.
Also Read : Munugode Bypoll: మునుగోడులో గెలుపెవరిది..? రంగంలోకి బెట్టింగ్ రాయుళ్లు..!
నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ప్రతి రైతు పండించిన పంటకు మంచి ధర వచ్చేలా కృషి చేయాలని సూచించారు. గన్నీ బ్యాగులను సరిపడా కొనుగోలు చేయాలని, వరి ధాన్యం లోడింగ్, అన్‌లోడ్ చేసేందుకు అధిక సంఖ్యలో కూలీలను నియమించాలని అధికారులను కోరారు. అలాగే అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.