వరిసాగు కంటే ప్రత్యామ్నాయం చూపించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్బీకే వ్యవస్థ కొత్తగా రావడంతో ప్యాడీ ప్రొక్యుర్‌మెంట్‌లో గ్యాప్ వచ్చిందన్నారు.. రైతులకు ఈక్రాప్ విశయంలో అవగాహనా లోపం ఓ కారణమన్న ఆయన.. గత ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు సమస్య రావడానికి కొత్త వ్యవస్థే కారణం అన్నారు.. అయితే, రాబోయే ఏడాది ఎలాంటి సమస్య ఉండదని భరోసా…
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ధాన్యం కొనమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. సీఎ కేసీఆర్ ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించింది. అయితే ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. Kకేంద్ర మంత్రి కిషన్…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. చివరకు తామే కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీ వేదికగా కేంద్రానికి డెడ్‌లైన్ పెట్టిన తర్వాత రోజు.. కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. తామే వరి కొనుగోలు చేసేందుకు సిద్ధమై.. దానిపై ప్రకటన చేశారు.. ఇక, మరుసటి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.. ఈ నేపథ్యంలో.. ఇవాళ వరి కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు…
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మూడవరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బోరవెల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను సీఎం కేసీఆర్ ప్రశాంతంగా ఉండనివ్వడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతుంటాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్ లోకి వచ్చినవారు, టీఆర్‌ఎస్ పార్టీలోనే వున్నవారు అనే రెండు వర్గాలు ఆధిపత్యం కోసం తపిస్తుంటాయి. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నేను పార్టీ మారుతున్నాననేది అవాస్తవం అని కొట్టి పారేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లి లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్ ధాన్యం కుంభకోణం… టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యుల పాత్ర… సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్ సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల మేర ధాన్యం…
యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా క్వింటల్ ధాన్యానికి ధర రూ.1960గా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతు మీద ప్రేమతో ముఖ్యమంత్రి కేసిఆర్ ధాన్యం సేకరణ చేస్తున్నారని ఆయన అన్నారు. యాసంగి ధాన్యం నూక శాతం నష్ట భారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని…
ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర రైతాంగం కొద్ది రోజులుగా పడుతున్న ఆందోళనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారని రాష్ట్ర గిరిజన, స్త్రీ-,శిశు.. సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. యాసంగిలో ధాన్యం సేకరణపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. యాసంగి లో తెలంగాణలో బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం షరతులు పెట్టి చేతులు ఎత్తివేయడంతో… సీఎం కేసీఆర్…
యాసంగిలో పండించిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయ తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఒక్కొక్క కోనుగోలు కేంద్రాలు దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లులు దగ్గర ఒక ఆఫీసర్ ఉంటారని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో 36 లక్షలు ఎకరాలలో సాగు జరిగిందని, 65 లక్షలు మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు.…
సీఎం కేసీఆర్ నిన్న యాసంగి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోళు చేస్తుందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లపై కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం జనగామ కలెక్టరేట్ రైస్మిల్లర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అత్యంత కష్ట, క్లిష్ట సమయంలోనూ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. రూ.3వేల కోట్ల నష్టాన్ని…