ధాన్యం కొనుగోలుకు సంబంధించి లేని సమస్యను వున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని కేందంమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పాత అగ్రిమెంట్ ప్రకారం.. కేంద్రానికి సరఫరా చేయాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంకా సప్లయ్ చేయలేదని ఆయన తెలిపారు. గత సీజన్‌లో ఇస్తామన్న బాయిల్డ్ రైసును రాష్ట్రం ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. గత సీజన్‌లో ఎఫ్‌సీఐకి 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. అగ్రిమెంట్ ప్రకారమే ఇంకా 8.34 లక్షల టన్నుల బాయిల్డ్ రైసును ఇంకా ఎఫ్‌సీఐకి…
ప్రతీ జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని.. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలని ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్.. రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్…
మరో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా పరిస్థితులపై గవర్నర్ కు నివేదిక ఇచ్చామన్నారు.. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు..…
ప్రతీ గింజను కొనాల్సింది సీఎం కేసీఆరేనని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. దాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్‌వి డ్రామాలు అని మండిపడ్డారు.. ఇప్పటికే 50 శాతం ధాన్యం రైతులు అమ్ముకున్నారని.. మిల్లర్లకు అమ్మిన రైతులకు కూడా మద్దతు ధర ఇవ్వాలని సూచించారు.. గవర్నర్‌తో భేటీకి ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. గవర్నర్ దృష్టికి అన్ని సమస్యలు తీసుకెళ్తాం అన్నారు.. ప్రభుత్వంపై భారం మూడు వేల కోట్ల అని మేం మొదటి నుండి చెబుతున్నాం.. అయినా…
తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత నెలకొంది. యాసంగి ధాన్యం మేమే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని, బీజేపీ పోరాటం దీక్ష ఫలితంగా సీఎం దిగొచ్చి ధాన్యం కొంటామని చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ రైతుల, బీజేపీ కార్యకర్తల విజయమని ఆయన అన్నారు. కింద పొగ పెడితే తట్టుకోలేక కుర్చీ కోసం ధాన్యం కొంటామని ప్రకటించారని, వరి వేస్తే ఉరి…
ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ స్పష్టతను ఇచ్చారు. నేడు తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆహార భద్రతలో భాగంగా ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత… భరించాలి… కానీ కేంద్రం తప్పించుకుంటుందని ఆయన మండిపడ్డారు. కేంద్రం దగ్గర డబ్బులు లేవా… ప్రధానికి మనస్సు లేదా అని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే పాపాల పుట్ట బయట పెడతామని, లండన్ లో…
పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో ఏఐసీసీ , టీపీసీసీ పిలుపు మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కరెంటు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర తగ్గించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తారా లేక కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తారా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు విని చాలా…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇక, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు.. రైతులను వరి వేయాలని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. బండి సంజయ్..…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ కలిసి రైతులను దగా చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. ఇక, ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్షలు.. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు సీఎం కేసీఆర్.. 24 గంటల్లో వరి కొనుగోళ్లపై తేల్చకపోతే.. తామే ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఇదే సమయంలో.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మీటింగ్ జరగనుంది. ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన యాసంగి వడ్ల కొనుగోళ్లపైనే కేబినెట్ లో ప్రధాన చర్చ జరగనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచే యాసంగి వడ్లు మార్కెట్లకు రావడం మొదలైంది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పినందున తాము కూడా యాసంగి వడ్లు…