KTR Tweet: ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీకి విరుద్ధంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ఇది కపట కాంగ్రెస్ బ్రాండ్ మోసం, దగా, వంచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కార్ కు పట్టవా? అన్ని రకాల వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వాల్సిందే అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విపలమైన ప్రభుత్వం… పండించిన వడ్లను సైతం సకాలంలో కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తుండటంతో కొనుగోలు…
రైతు సర్వతోముఖాభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆగస్టు 15 కల్లా, రైతు రుణమాఫీ అమలుచేసి తీరుతామని ఇప్పటికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు, మేము ప్రకటించిన విషయం విదితమే. తిరిగి రైతు ఈ అప్పుల ఊబిలో పడిపోకుండా మా ప్రభుత్వము రైతాంగ సంక్షేమం కోసం ఇతర పథకాల అమలుకు ప్రణాళిక చేస్తుందన్నారు. ముఖ్యంగా పంటనష్టపోయిన సందర్భాలలో రైతులను ఆదుకునే విధంగా పంటభీమా,…
అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కూడా కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మద్దతు ధర ఇచ్చి కొంటామని, సీఎస్.. కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చామని, రైతులు ఆందోళన చెందోద్దని ఆయన పేర్కొన్నారు. నష్టం ప్రభుత్వం భరిస్తుందని, కొందరు మిల్లర్లు తరుగు తీస్తున్నారని, ఇది సరికాదు.. ఆపేయండని ఉత్తమ్ అన్నారు. చివరి గింజ వరకు కొంటామని, నారాయణ పూర్ డ్యామ్ నుండి నీటి విడుదలకు అంగీకారం చెప్పారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ని…
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్‌లో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
నిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లాలో మొత్తం 462 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, వాటిలో 417 కేంద్రాలు సహకార సంఘాల కింద, 39 ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) ద్వారా, ఆరు కేంద్రాలు మునిసిపల్ ఏరియాల్లో పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) కింద పనిచేస్తాయని తెలిపారు. ఆయన ప్రకారం, ప్రభుత్వం…
ఏది ఏమైనా సరే… ఈ నెల 31వ తేదీలోగా గత ఏడాది వానాకాలం సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో సేకరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకో వాలని పౌరసరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్.చౌహాన్ అధికారులను ఆదేశించారు. రైసు మిల్లర్ల నుంచి బియ్యాన్ని సేకరించి ఎఫ్ సిఐకి అప్పగించడానికి కేవలం 13 రోజుల సమయం మాత్రమే ఉందని ఈ సమయంలో అందరం సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్,…
జనవరి 31వ తేదీలోపు భారత ఆహార సంస్థకు (ఎఫ్.సి.ఐ కి) బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్, ఇతర అధికారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్‌సిఐ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కస్టమ్…
రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు - నేడు ఏం జరిగిందో అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.