ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుంచి ఇంకా ఉలుకు పలుకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్తోందని.. అయితే ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పడం లేదని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై చివరి ప్రయత్నంగా తాను కేంద్రాన్ని కలవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఢిల్లీకి వెళ్తామని, అక్కడ కేంద్ర మంత్రులు, సంబంధిత అధికారులను.. అవసరమైతే ప్రధానిని కూడా…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. వరి ధాన్యం మాత్రం కొంటామని.. అయితే ఎప్పుడు కొంటాం.. ఎంత కొంటామో తరువాత చెప్తామని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ నుంచి వరి ధాన్యం కొంటున్నట్టుగా తెలంగాణ నుంచి ఎందుకు కొనుగోలు చేయడంలేదని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. పంజాబ్ కు ఒక…
తెలంగాణ పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్. సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతే బాగుండని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఇవాళ ఇందిరా పార్క్ లో నిర్వహించిన మహా ధర్నా లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… బీజేపీ మాట్లాడితే అబద్దాలని… అబద్దాలు మాట్లాడుతూ.. అడ్డగోలు పాలన చేస్తోందని ఫైర్ అయ్యారు. ఏడాదిగా ఢిల్లీ లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని……
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వరిపై మొదలైన మాటల యుద్ధం సవాళ్లు విసురుకునే దాకా వెళుతోంది. యాసంగి ధాన్యం సంగతేంటని ప్రశ్నించిన టీఆర్ఎస్.. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలకు పిలుపు ఇచ్చింది. నేడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు ప్లాన్ చేశారు. రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. పంజాబ్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాజా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని… కేసీఆర్ బీజేపీ పై అనేక విమర్శలు చేశారని మండిపడ్డారు. బీజేపీ పార్టీని భయపెట్టే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ భయపెట్టినంత మాత్రాన బీజేపీ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ భయపడదని హెచ్చరించారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచి…
వానాకాలం పండిన పంట ప్రతి గింజ కొంటామని.. ఆ దిశగా కేంద్రంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6540 ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని… ఇప్పటివరకు 1762 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అధికారులు సూచించిన తేదీల్లో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని… యాసంగిలో సాగయ్యే ప్రతి పంటను కేంద్రం కొనుగోలు చేయాలని…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సెక్రటేరియట్ నుండి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సమీక్షించారు. వరి సేకరణ, సూపర్ స్ప్రెడర్ వర్గాలకు టీకాలు వేయడం, విత్తనాలు, ఎరువుల సరఫరా మరియు లభ్యత ఏర్పాట్లపై ఈ సమీక్ష నిర్వహించారు. త్వరలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించనున్నందున రాబోయే 6 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా…