Nadendla Manohar : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటి వరకు రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు.. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.…
రాబోయే ఐదు రోజుల్లోనే రైతులకు ధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులని పొందుపరిచామని వెల్లడించారు.
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లాలో అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశాన్ని చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొన్న భట్టి, జిల్లాల ఇంచార్జి మంత్రులు అన్ని ప్రాంతాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. భట్టి ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కొనుగోలు చేసింది. ఖమ్మం, భద్రాద్రి…
Rythu Bharosa : త్వరలోనే రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిన్నదైనా, కొత్తదైనా ఆర్థికంగా ఎదురైన సమస్యలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత‍్వం కృషి చేసిందని తెలిపారు. ఆర్థిక బాద్యతల మధ్యలోనే సీఎం రుణమాఫీ చేసినట్టు పేర్కొన్నారు. గత ఏడాది ఖరీఫ్ పంట కాలంలో రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.33,000 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. దేశంలో అత్యధికంగా ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.…
బీజేపీ అధికారంలోకి వస్తే మేడిగడ్డపై సీబీఐ విచారణ చేయిస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీటలు వారుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ కు తెలివి వచ్చిందని.. సీబీఐ విచారణకు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడుగా తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మునిగి పోతున్న నావ అని ఎద్దేవా చేశారు. డాటార్ డాడీల మధ్య ఉత్తరాలు ఇంకా జరుగుతాయని విమర్శించారు.. కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయన్నారు.…
CM Revanth Reddy: హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి…
Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి అయినట్లు పేర్కొనింది. మే 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్నారు.
తెలంగాణలో యాసంగి పంట సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశంలో అత్యధిక వరి సాగు జరిగే రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.
Nadendla Manohar : ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విస్మరించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674 కోట్ల మేర బకాయిలను వెంటనే చెల్లించామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 5.65 లక్షల మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.…
Paddy Procurement : నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు పండించిన బంగారం కుప్పలుతెప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ధాన్యం రాశులు కళ్లెదుటే క్షీణిస్తుంటే రైతుల గుండెలు మాత్రం ఆందోళనతో కొట్టుకుంటున్నాయి. దీనికి కారణం లారీల కొరత.. ధాన్యాన్ని తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యం కుప్పలతో నిండిపోయాయి. రోజుల తరబడి రైతులు తమ ధాన్యంతో పడిగాపులు కాస్తున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీని వెనుక అసలు కథ వేరే ఉంది..…