Bandi Sanjay: ఎఫ్.సి.ఐ. తనిఖీలపై సన్నాయి నొక్కులా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండిసంజయ్ లేఖ రాశారు. వరిధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నా మీ ప్రభుత్వం దున్నపోతుపై వాన పడ్డ చందంగా వ్యవహరించిందని అన్నారు. 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించి 20 రోజులు గడుస్తున్నా కేవలం 2500 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారని గుర్తుచేశారు.
ఇప్పటి వరకు కనీసం 10శాతం ధాన్యం కొనుగోలు కూడా జరగలేదన్నారు. ఐకెపి కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడంతో తక్కువ ధరకే దళారులకు పంటను అమ్ముకుని రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆవేన వ్యక్తం చేశారు. ధాన్యం పండించిన రైతులు అకాల వర్షానికి నిలువునా మునిగారని తెలిపారు. మీ మాట నమ్మి వరి పంట వేయని రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపైన, మీ పైన ఉందని గుర్తుచేశారు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
నష్టపోయిన రైతాంగం గురించి ఆలోచించాల్సిన ఆర్థిక శాఖామంత్రి, సివిల్ సప్లయ్ శాఖామంత్రి, ఇతర మంత్రులు ఎఫ్.సి.ఐ. తనిఖీలపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. వారి వ్యవహారం చూస్తుంటే మిల్లర్లతో, టీఆర్‌ఎస్ నాయకులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎటువంటి తప్పు చేయకపోతే తనిఖీలపై ఎందుకు ఆ ఉలికిపాటని ప్రశ్నించారు. ధాన్యం అన్‌లోడ్‌కు ముందే మాకిచ్చే కమీషన్ తేల్చండంటూ రైస్‌మిల్లర్లు కోరుతుంటే ఎఫ్.సి.ఐ. తనిఖీల వల్లే ధాన్యం ఆన్‌లోడ్ సమస్య ఏర్పడుతుందంటూ మంత్రులు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఎఫ్.సి.ఐ. తనిఖీలు జరిగితే మంత్రిగారికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే భయమా? రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి కేంద్రాలను వెంటనే ప్రారంభించి, ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని, తడిసిన ధాన్యాన్ని సైతం కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ ద్వారా డిమాండ్ చేస్తున్నామని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!