వైసీపీలో ఒంగోలు వార్ మొదలైందా? జిల్లా అధ్యక్ష పదవి విషయంలో స్థానిక నేతలు గరం గరంగా ఉన్నారా? మమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే… ఆ తర్వాత మీ ఇష్టం అంటూ అధిష్టానానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారా? ఇంతకీ ఒంగోలులో ఏం జరుగుతోంది? స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నది ఎవర్ని? జిల్లా అధ్యక్ష పదవి చుట్టూ ముసురుకుంటున్న ముసలం ఏంటి? ఏపీలో వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ప్రకాశం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ స్దానాలే…
కంచుకోటలో కార్ పార్టీకి కేరాఫ్ మాయమైపోతోందా? చివరికి మేయర్ సీటు కూడా కారుజారిపోయే ముప్పు ముంచుకు వస్తోందా? మేయర్ కదలికలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయా? ఇంతకీ ఏ మేయర్ సీటు గులాబీ దళానికి దూరమయ్యే ముప్పు ముంచుకు వస్తోంది? ఏ పార్టీ వైపు చూస్తున్నారా మేయర్? అంత జరుగుతున్నా…. బీఆర్ఎస్ నేతలు చేష్టలుడిగి చూస్తున్నారు ఎందుకు? కార్ పార్టీకి కంచుకోట కరీంనగర్. అనేక సంక్షోభ సమయాల్లో గులాబీ దళానికి అండగా ఉన్న జిల్లా ఇది. అసెంబ్లీ…
సాధారణంగా సౌమ్యంగా ఉండే ఆ శాసనసభ్యురాలికి ఉన్నట్టుండి కోపం కట్టలు తెంచుకుంది. అది కూడా అలా ఇలా కాదు….. ప్రత్యర్థుల మీద బూతుల సునామీ విరుచుకుపడింది. అన్నీ డ్యాష్…. డ్యాష్… బూతులేనట. ఎందుకంత శివాలెత్తిపోయారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే? నియోజకవర్గ పరిణామాల ప్రభావమా ? లేక మరో కారణమా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా బూతు పురాణపు కహానీ? కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు ఎక్కడ లేని ఎప్పుడూ లేనంత కోపం వచ్చేసిందట. బీఆర్ఎస్ తరపున గెలిచిన కోవాలక్ష్మి…
టీడీపీ వేవ్‌ను తట్టుకుని నిలబడ్డ ఆ వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గానికి కనీసం గెస్ట్‌గా కూడా రావడం లేదు. ఫలితాలు వచ్చాక జస్ట్ ఒకసారి అలా కనిపించి మాయమైపోయారు. పనుల కోసం సొంత పార్టీ వాళ్ళు ఫోన్ చేసినా… స్పందించకుండా.. కూల్ కూల్ అంటూ శాంతి మంత్రం జపిస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన పార్టీ మారతారన్న ప్రచారంలో నిజమెంత? కూటమి సునామీలో కూడా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు బాలనాగిరెడ్డి.…
ఓటమిపై మొన్న ఆవేదన.. నిన్న విశ్లేషణ.. నేడు అధినేత తప్పిదాలపై పరోక్ష విమర్శలు. వైసీపీలో స్వరం మారుతోందా? నేతలు ఒక్కొక్కరుగా ఓపెనైపోతున్నారా? ఆ మాజీ ఎమ్మెల్యే విశ్లేషణలకు పార్టీ వర్గాల్లో ఎందుకంత ప్రాధాన్యం దక్కుతోంది? ఆయన మాటలకు మద్దతు పెరుగుతోందన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఓటమిపై ఏంటి ఆయన విశ్లేషణ? కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్టుగా… ఏపీలో వైసీపీ ఓటమికి కూడా రకరకాల విశ్లేషణలు బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో బయటి వాళ్ళు చెప్పే…
ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను బీజేపీ టార్గెట్ చేసిందా? ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయిస్తే… ఒక్క దానం మీదనే ఎందుకు ఫిర్యాదు చేసింది? అసలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న జంపింగ్ గేమ్‌లోకి బీజేపీ ఎందుకు ఎంటరైంది? దాని పరిణామాలు ఎలా మారే ఛాన్స్ ఉంది? తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై ఫిరాయింపుల సినిమాలో కొత్తగా కనిపించబోతున్న సీన్స్ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ పొలిటికల్ జంపింగ్ జపాంగ్‌ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అనూహ్యంగా ఈ ఎపిసోడ్‌లోకి…
ఏపీలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గం మీద అమిత్ షా నుంచి గల్లీ లీడర్ దాకా బీజేపీ నేతలంతా ఫోకస్ పెట్టారు. ఫ్యాన్ మీద పైచేయి కోసం బీజేపీ బెటాలియన్ మొత్తం దిగిపోతోంది. కానీ.... అదే పార్టీకి చెందిన ఒక్క ముఖ్య నేత మాత్రం ఆ వైపే చూడ్డం లేదట. పైగా సెగ్మెంట్లో గట్టి పట్టున్న నాయకుడు ఆయన. జాతీయ నేతలు వస్తున్నా పట్టించుకోని ఆ నియోజకవర్గ నేత ఎవరు? ఎందుకలా చేస్తున్నారు?