పార్టీలో లేరు…. పార్టీతో సంబంధం లేదు. కానీ… అధిష్టానం పిలుపునిచ్చిందంటూ…. సడన్‌గా ఓ గ్రూప్ గులాబీ కండువాలు మెడలో మెడలో వేసుకుని వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసింది. గులాబీ పార్టీకి జై కొట్టింది. అది చూసి… పార్టీ కేడరే నోరెళ్ళబెట్టాల్సి వచ్చిందట. ఇంతకీ ఎక్కడ జరిగిందా విచిత్ర ఘటన? ఎందుకలా కొత్త గ్రూప్ రోడ్డు మీదికి వచ్చి ఆందోళ చేసింది? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి…
తెలంగాణలో జీఓ 29 దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గుదిబండ కాబోతోందా? బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంటోందా? వివాదం ముదిరితే ఏకంగా రాహుల్ గాంధీనే మాట్లాడటానికి ఇరుకున పడే ప్రమాదం ఉందా? ఇంతకీ ఏంటా జీవో 29? దానితో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? జీఓ నంబర్ 29ని రద్దు చేయాలని, జీఓ 55ను అమలు చేయాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు గ్రూప్ వన్ అభ్యర్థులు. దాని…
తెలంగాణలో గులాబీ దళం పోగొట్టుకున్న చోటే వెదుక్కునే ప్రయత్నం మొదలుపెట్టిందా? కాస్త కష్టపడి వెదికితే దొరికే ఛాన్స్ ఎంతవరకు ఉంది? పదేళ్ళ అధికార కాలంలో కనిపించని సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు బీఆర్ఎస్కు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఇన్నాళ్ళు తాము ఎవరికి దూరం అయ్యామో… పవర్ పోయాకగానీ తెలిసి రాలేదా? ఇంతకీ బీఆర్ఎస్ కొత్త స్కెచ్ ఏంటి? దగ్గరికి తీయాలనుకుంటున్న వర్గాలేవి? అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములు, తగులుతున్న ఎదురుదెబ్బలతో కారుకు గట్టి రిపేరే చేయాలని అనుకుంటోందట…
ఆ ఇద్దరు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారులు…తెలంగాణలో కలిసి పని చేయబోతున్నారా? నాటి ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన వారికి…కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందా ? బీఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు బయటకు తీయడమే ప్రభుత్వ లక్ష్యమా? కేంద్రం నుంచి ఆ అధికారిని రాష్ట్రానికి తీసుకురావడం వెనుక ఉన్న కారణాలు ఏంటి ? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో…
సభ్యత్వ నమోదు ఆ పార్టీ లోని కొందరు నేతలకు టెన్షన్ పుట్టిస్తుంది అట… టార్గెట్ రీచ్ అయ్యేందుకు తంటాలు పడుతున్నారు అట… ఒకరిద్దరు నేతలు అయితే సభ్యత్వం చేయించే బాధ్యతను ఏకంగా ఏజెన్సీలకే అప్పగించారు అట… మరికొందరు సభ్యత్వం చేయిస్తే డబ్బులు ఆఫర్ చేస్తున్నారు అట…. పార్టీ లో ఇదేమి కల్చర్ అనే చర్చ జరుగుతుంది. తెలంగాణ బీజేపీలో సభ్యత్వ నమోదుపై డ్రైవ్ జోరుగా నడుస్తోంది. పెట్టుకున్న టార్గెట్‌కు…చాలా దూరంలో ఉంది తెలంగాణ బీజేపీ. 50 లక్షల…
ఆ మాజీ మంత్రి పక్క జిల్లాలో సీటు పై ఫోకస్ చేశారా ? ఇప్పటి నుంచే అక్కడకి షిఫ్ట్ అయిపోతానని అధినేత ముందు రిక్వెస్ట్ పెట్టారా? ఆశించిన స్థాయిలో రెస్పాండ్ రాకపోవడంతో వేరే లెక్క వేస్తున్నారా? తాను రెండుసార్లు గెలిచిన నియోజకవర్గంలో అంత ఇంట్రెస్ట్ లేదా ? కురసాల కన్నబాబు…జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యంలో చేరి… 2009లో కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ…
అసెంబ్లీ ఎన్నికలైపోయి ఏడాది కావస్తున్న టైంలో ఆ ఎంపీకి ఓటమి పాఠాలు గుర్తుకు వచ్చాయా? మనం గెలవకపోవడానికి బాధ్యులు ఎవరంటూ కొత్తగా ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారు? పార్టీలోనే ముఖ్యులు ఎవరినన్నా టార్గెట్ చేశారా? లేక ఆయన కీలక పదవి ఏదన్నా ఆశిస్తూ సంచలనం రేపాలనుకున్నారా? తెలంగాణ కాషాయ దళంలో ఇంటర్నల్‌గా ఏం జరుగుతోంది? వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ ఎంపీ ఎవరు? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్…. ఎప్పుడూ రాష్ట్రంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ… సంచలన ప్రకటనలు…
అక్కడ ఎమ్మెల్యేకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట. ఆ చూపిస్తోంది కూడా సొంత కేడరే కావడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదట. పార్టీ అధిష్టానం దగ్గర పరువు పోతోందిరా.. ప్లీజ్… ఈసారికి కో ఆపరేట్ చేయండర్రా… అని బతిమాలుకుంటున్నా… డోంట్ కేర్,… ఇన్నాళ్ళు ఈ బుద్ధి ఏ గాడిదలు కాసిందని ఘాటుగానే రిప్లయ్ ఇస్తున్నారట. అంతలా ఇరకాటంలో పడ్డ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటాయన బతిమూలుడు, బామాలుడు యవ్వారం? కొమురం భీం జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గం…
నర్సాపురం పొలిటికల్ లేబొరేటరీస్‌లో వైసీపీ ప్రయోగాలు వికటించాయా? ఎవ్వరూ చేయని, కనీసం ఆలోచన కూడా రాని ఎక్స్‌పెరిమెంట్‌కు మేం శ్రీకారం చుట్టామని నాడు గొప్పలు చెప్పుకున్న పార్టీకి నేడు అక్కడ దిక్కు లేకుండా పోయిందా? రండి బాబూ… రండి… పదవి తీసుకోండని పిలుస్తున్నా… అటువైపు చూసేవాళ్ళే కరవయ్యారా? మీ పదవి మాకొద్దు బాబోయ్ అని పార్టీ సీనియర్సే దండం పెట్టడానికి కారణం ఏంటి? అసలేంటా పదవి? నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం….. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా…
2019 ఎన్నికల్లో పడమరలో ఫ్యాన్ ఫుల్ స్పీడులో తిరిగింది! ఇప్పుడు ఒకటో నంబర్లో పెట్టినట్టుగా ఉంది! రెక్కలుగా ఉన్నవాళ్లంతా సైడయ్యారు! గాలిరాక కేడర్ ఉక్కిరిబిక్కిరవుతోంది! గ్రంధి రందితో పక్క చూపులు చూస్తున్నారని నియోజకవర్గంలో టాక్. ఆచంట లీడర్ ఏచెంత ఉన్నారో తెలియక అయోమయం! ఆళ్ల కాళీ కృష్ణ వెళ్లిపోయాక ఆ ప్లేస్ ఇంకా ఖాళీగానే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో నరసాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు చాలా కీలకమైనవి. ఇక్కడి ఓటర్లు ఎప్పుడూ వన్ సైడ్‌గా గెలుపును…