ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి, మరో ప్రోటోకాల్ పోస్ట్‌లో ఉన్న నాయకుడికి మధ్య ఒకరకంగా యుద్ధమే జరుగుతోందా? పాత కొత్త వైరం ముదురు పాకాన పడిందా? ఇద్దరి వర్గపోరులో పార్టీ పెద్దలు సైతం తలబాదుకోవాల్సి వస్తోందా? ఏకంగా రాష్ట్ర మంత్రి ముందే రచ్చ చేసుకున్న ఆ ఇద్దరు ఎవరు? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? వనపర్తి కాంగ్రెస్ వార్ పీక్స్ చేరుతోందట. నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య పంచాయతీ ఓ రేంజ్లో…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తరంగాలు ఎట్నుంచి ఎటెటో ప్రయాణిస్తున్నాయా? కేసు దర్యాప్తు కొత్త టర్న్ తీసుకోబోతోందా? అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్స్ వచ్చేశాయి.. కేసు కథ కంచికేనన్న ప్రచారం మొదలైన టైంలో కీలకమైన మలుపు తిరగబోతోందా? హస్తం, కమలం మధ్యలో గులాబీ నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోందా? అసలేంటి.. కొత్తగా మొదలైన కథ? ఆ విషయంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది. ఇన్నాళ్ళు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా జరుగుతున్న…
ఆ టీడీపీ సీనియర్ పొలిటికల్ కెరీర్‌కు ఇక ఎండ్ కార్డ్ పడ్డట్టేనా? ఇష్టం లేకుండానే పార్టీ ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చేసిందా? ఒకప్పుడు నంబర్ టూ అనుకున్న నేతకు అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకే ఒక్క ఛాన్స్… లాస్ట్ ఛాన్స్… ప్లీజ్… అని ఆయన అంటున్నా… కనీసం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదు? బలవంతపు రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చిన ఆ సూపర్ సీనియర్ ఎవరు? ఇప్పటికీ ఆయన కుటుంబంలో ఎన్ని పదవులు ఉన్నాయి? యనమల రామకృష్ణుడు……
ఆ కాంగ్రెస్‌పార్టీ సూపర్ సీనియర్… మోఖా చూసి ధక్కా ఇస్తున్నారా? కావాల్సింది సాధించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నారా? పార్టీ నన్ను వాడుకుని వదిలేసిందన్న కామెంట్స్ వెనక వ్యూహం ఉందా? లేక అవి కట్టలు తెంచుకున్న ఆవేదన నుంచి వచ్చాయా? సరిగ్గా ఎలక్షన్ టైం చూసి మనసులో మాట బయటపెట్టిన ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎవరు? ఏంటాయన వ్యధాభరిత రాజకీయ గాధ? టీ. జీవన్‌రెడ్డి… ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణదాకా…కాంగ్రెస్ రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు.…
తెలంగాణ కేబినెట్లో కొందరు మంత్రులు రెడ్ జోన్లో ఉన్నారా? వారికి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయా? ఆ ఒక్కటి తేడా అయితే… కాంగ్రెస్ అధిష్టానం యాక్షన్ తీసుకునే ముప్పు ముంచుకొస్తోందా? ఆ రిజల్టే వాళ్ళ పనితీరుకు గీటురాయా? ఇంతకీ ఏంటా డేంజర్? తమను తాము నిరూపించుకుని సేఫ్‌జోన్‌లోకి వెళ్ళాల్సిన ఆ మంత్రులు ఎవరు? కాంగ్రెస్ సర్కార్‌కు ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్ గా మారిపోయాయి. పార్టీ అధికారంలోకి వచ్చాక పెద్దల సభకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. అందులోనూ……
అక్కడ ఇసుక మాఫియా… రెండు నదుల్ని అడ్డంగా దోచేస్తోందా? అడ్డొచ్చేవాళ్ళు ఎవరైనా సరే… ఇక అంతే సంగతులని వార్నింగ్ ఇస్తోందా? ఇసుక మాఫియాకు లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? ఇతరులు ఇసుక రీచ్‌ల్లో అడుగుపెడితే… దబిడి దిబిడేనని అంటున్నది ఎక్కడ? ఎందుకంత బరితెగింపు? ఇష్టం వచ్చినట్టు తోడుకో…. నచ్చిన రేటుకు అమ్ముసుకో…. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియెజకవర్గంలో వినిపిస్తున్న స్లోగన్ ఇదేనట. దొరినంత దోచేయ్ అన్నట్టుగా సాగుతోందట ఇసుక దందా. కూటమి ప్రభుత్వం…
ఆ మాజీ ఎంపీ… ఏపీ డిప్యూటీ సీఎంకు సలహాదారు అవ్వాలనుకుంటున్నారా? ఆయన అడక్కపోయినా… అలాచేసెయ్… ఇలా చేసెయ్ అంటూ ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారా? సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్‌కంటే మీరే బెటర్ అంటూ…పవన్‌ను ఆకాశానికెత్తేస్తున్న ఆ సీనియర్ ఎవరు? అడక్కుండానే నేను చెప్పాల్సింది చెప్పేశానని ఎందుకు అంటున్నారు? ఏ విషయంలో డిప్యూటీ సీఎం బెటరని అంటున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జగన్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ ఆప్షన్ అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అందుకున్న…
ఆ ఏపీ మంత్రి వైఖరితో లోకల్, నాన్ లోకల్ సమస్యలు తలెత్తుతున్నాయా? బయటి నుంచి ఎవరో వచ్చి మా నెత్తినెక్కి డాన్స్ ఆడుతున్నారంటూ… ఆ యన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రగిలిపోతున్నారా? మా ఎమ్మెల్యే మంత్రి అయితే… ఆ లెక్కే వేరబ్బా అనుకున్నవాళ్ళ అంచనాలు తల్లకిందులయ్యాయా? ఇంతకీ ఎవరా మినిస్టర్ సాబ్? ఏంటా లోకల్, నాన్ లోకల్ వార్? కొలుసు పార్ధసారధి… ఏపీ మినిస్టర్. టీడీపీ తరపున తొలిసారి నూజివీడు నుంచి గెలిచి… బీసీ…
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలుకుంటూ...పార్టీని రీ సెట్ చేసే పనిలో సీరియస్‌గా ఉన్నారట వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ క్రమంలోనే సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడుతూ... భరోసా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ పరంగా చేయాల్సిన అన్ని పనులు గట్టిగానే చేద్దామని ధైర్యం చెబుతుండటంతో... మెల్లిగా ఒక్కొక్కరు అజ్ఞాతం వీడుతున్నారట.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం...ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డాగా, బాంబుల గడ్డగా ప్రసిద్ధి. ఇక్కడ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి విలవిల్లాడిన కుటుంబాలు ఎన్నో. పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ కక్షలతోనే నరుకుడు ప్రోగ్రామ్స్ నడిచేవి. అయితే... రెండు దశాబ్దాల నుంచి ఆ తీవ్రత బాగా తగ్గింది. రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఆళ్ళగడ్డలో టీడీపీకి బలమైన క్యాడర్ వుందని చెబుతారు.