Damadoara Raja Narasimha : అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్ జరిగితే, తెలంగాణలో ప్రతి పది లక్షల జనాభాకు 4.88 డొనేషన్స్ జరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అవయవదానంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకుగానూ రాష్ట్రానికి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యు ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (NOTTO) అవార్డు ప్రకటించింది. శనివారం, ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల కార్యక్రమంలో కేంద్ర…
AP deputy CM Pawan Kalyan Tweet: యాక్సిడెంట్‌లో జనసేన కార్యకర్త మృతి చెందారు. ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం, చందాల గ్రామానికి చెందిన జనసైనికుడు చందూ వీర వెంకట వసంతరాయలు గాయపడి బ్రెయిన్ డెడ్ కు గురయ్యారన్న వార్త తీవ్ర బాధాకరమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
నిమ్స్‌లో యువకుడికి సక్సెస్ ఫుల్‌గా గుండె మార్పిడి పూర్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటున్నారు.. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్లను అభినందించారు.మంత్రి.. డోనర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు.
Organ Donation: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ వద్ద జరిగిన విషాద రోడ్డు ప్రమాదం విషాదంగా ముగిసింది. తొమ్మిది రోజుల క్రితం డివైడర్‌ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు యశ్వంత్, భూమిక తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డాక్టర్ యశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, డాక్టర్ భూమిక గాయాలతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, డాక్టర్ భూమికకు బ్రెయిన్ డెడ్ కావడంతో.. అవయవ దానం చేయాలని ఆమె కుటుంబం నిర్ణయించుకుంది. ఈ…
కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడుకి చెందిన పెద్దయ్య (59) మొదడులో నరాలు చిట్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించగా బ్రెయిన్ డెడ్ అయి అచేతనావస్థలోకి వెళ్లారు. పెద్దయ్య కుటుంబ సభ్యులతో ఏపీ జీవన్ దాన్, సమన్వయకర్త, కుటుంబ సభ్యులకు, బంధువులకు అవగాహన కల్పించడంతో అవయవదానానికి అంగీకరించారు.
భార్య జీవితానికి సహచరురాలే కాదు, గమ్యానికి ప్రేరణ కూడా. ఆమె ప్రేమ, అనురాగం, బంధం భర్త జీవితాన్ని మరింత విలువైనదిగా మారుస్తాయి. భార్య అంటే కేవలం ఒక పాత్ర కాదు.. ఆమె భర్త ఆనందానికి మూలం, భర్త బాధలను తగ్గించే ఓదార్పు, ప్రతి విజయానికి వెనుక ఉన్న అండగా నిలిచే వ్యక్తి. ఆమె తోడు ఒక కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఒక సంతోషకరమైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది.
ఆ ఇంట్లో పెళ్లి భాజాల చప్పుడు చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఇంతలో చావు డప్పు వినాల్సి వచ్చింది. ఇది అత్యంత బాధాకరం. నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన బసుదే రాహుల్ (25) అనే యువకుడు ఏప్రిల్ 21న వివాహం చేసుకున్నాడు.