నిమ్స్‌లో యువకుడికి సక్సెస్ ఫుల్‌గా గుండె మార్పిడి పూర్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటున్నాడు.. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్లను అభినందించారు.మంత్రి.. డోనర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు.
READ MORE: Air Force chief: ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాగా F-35 జెట్‌లను కొనలేము..
ఇదిలా ఉండగా… గతేడాది మేలో కూడా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక రోగికి నిమ్స్ వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన షేక్ షనాజ్ (29) రెండేండ్లుగా డైలేటెడ్ కార్డియో మయోపతితో బాధపడింది. దీని కారణంగా గుండె పనితీరు మందగించి, శరీరానికి కావాల్సిన రక్తాన్ని పంపింగ్ చేయలేకపోయింది. ఆమె నిమ్స్ వైద్యులను ఆశ్రయించింది. ఈ మేరకు నిమ్స్ కార్డియోథోరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర రావు, డాక్టర్ గోపాల్ నేతృత్వంలో రోగికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ రిపోర్ట్‌ల ప్రకారం.. రోగికి గుండె మార్పిడి చికిత్స అందించారు.
READ MORE: RK Roja: చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..!