ఈ సృష్టిలో మానవ జన్మ మహా అద్భుతమైంది. తల్లి గర్భంలో అన్ని అవయవాలతో మానవ ఆకారం రూపుదిద్దుకుని ధరణిపైకి వస్తారు. అయితే ఒక విషయమేంటంటే.. ఈ దేహంలో ఏదైనా డ్యామేజ్ అయితే తిరిగి పొందే అవకాశం ఉండదు. వాహనాలకు స్పేర్‌పార్ట్స్ దొరికినట్లుగా అవయవాలు లభించవు. అందుకే జీవితాంతం అవిటివాడిగానే ఉండిపోవల్సి వస్తోంది. కానీ ఢిల్లీలోని వైద్యులు మాత్రం మెరాకిల్ సృష్టించారు. వైద్యశాస్త్రంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
ఢిల్లీలో అతనో చిత్రకారుడు. రైలు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు. ఇక జీవితంలో పెయింటింగ్ (Delhi Painter) వేసే అవకాశమే ఉండదనుకున్నాడు. కానీ ఓ స్త్రీ మూర్తి పుణ్యం వల్ల అతడికి మళ్లీ కొత్త జీవితం లభించింది.
ప్రముఖ దక్షిణ ఢిల్లీ పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా ఇటీవల బ్రెయిన్ డెడ్ అయింది. అయితే ఆమె ముందుగానే అవయవ దానం చేసింది. దీంతో ఆమె అవయవాలు స్వాధీనం చేసుకున్న సర్ గంగా రామ్ ఆస్పత్రి వైద్యులు (Sir Ganga ram Hospital).. మరో నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
2020లో ట్రైన్ యాక్సిడెంట్‌లో రెండు చేతులు కోల్పోయిన పెయింటర్‌కి శస్త్రచికిత్స ద్వారా మీనా మెహతా చేతులను మార్పిడి చేశారు. ఈ ఆపరేషన్ అద్భుతంగా సక్సెస్ అయింది. 45 ఏళ్ల ఆ వ్యక్తి తిరిగి రెండు చేతులను పొందుకోల్గిగాడు. ఆమె పుణ్యం వల్ల అతడు తన కలలను సాకారం చేసుకోగల్గిగాడు. అలాగే మూత్రపిండాలు, కాలేయం, కార్నియాలు మరో ముగ్గురి జీవితాలను కూడా మార్చేశాయి. మొత్తానికి మీనా మెహతా.. ఈ లోకాన్ని విడిచిపెడుతూ మరో నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులను నింపి ప్రాణదాతగా నిలిచిపోయింది.
దాదాపు 12 గంటల పాటు వైద్య బృందం శ్రమించి రెండు చేతులు సర్జరీ చేశారు. శస్త్రచికిత్స విజయవంతంగా కావడంతో డాక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు చిత్రకారుడు కూడా వారితో కలిసి ఫొటోలకు పోజులివ్వడం విశేషం. సంపూర్ణ ఆరోగ్యంతో గురువారం అతడు డిశ్చార్జ్ కాబోతున్నాడు. మొత్తానికి ఢిల్లీ వైద్యులు వైద్య చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించారు.