Kerala: 16 ఏళ్ల బాలుడు చనిపోయి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. 10 తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించడానికి రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సారంగ్ 10వ తరగతిలో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి టాపర్ గా నిలిచారు. సారంగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలవడం ఆ కుటుంబాన్ని మరింతగా బాధపడుతోంది.
Brain Dead : హైదరాబాదుకు చెందిన 30 ఏళ్ల కార్మికుడు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి అవయవాలను దానం చేశారు. జీవన్‌దాన్ ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ ద్వారా ఈ అవయవదానం జరిగింది.
మనిషి పుట్టుక నుంచి చావు దాకా ప్రతీ విషయంలోనూ ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుంది అంటారు పెద్దలు. కొంతమంది సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తే.. మరికొంత మంది తాము చనిపోయినా అవయవదానంతో నలుగురికి పునర్జన్మ కలిగించే గొప్ప భాగ్యం పొందుతారు.
Women: 'ఆమె'కు మరోసారి వందనం. ఎందుకంటే 'ఆమె' ఆకాశంలో సగమేనేమో గానీ అవయవదానంలో మాత్రం అంతకుమించి. తల్లిగా, సోదరిగా, ఇల్లాలిగా ప్రేమను పంచటంలో మాత్రమే కాదు. చివరికి తన శరీర భాగాలను పంచటంలో సైతం 'ఆమె' తనకుతానే సాటి అని నిరూపించుకుంది.
తరుచూ మనం అవయవదానం గొప్పతనం గురించి చెబుతుంటాం. అవయవాలను దానం చేయడం వల్ల మరికొంత మందికి పునర్జన్మ ప్రసాదించే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే.. అవయవదానం గొప్పతనం తెలిసేలా చేసింది. పూణేలో ఓ యువతి అవయవదానం చేయడం వల్ల మరో ఐదుగురికి పునర్జన్మ లభించింది. ఇందులో ఇద్దరు ఆర్మీ సైనికులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే పూణేకు చెందిన ఓ యువతి ఇటీవల ఓ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయింది. ప్రమాదానికి గురైన యువతని పూణేలోని…
సృష్టిలో తల్లి జన్మనిస్తుంది. కానీ అవయవదానం చేసేవారు పునర్జన్మను ఇచ్చినట్టే. ఈమధ్యకాలంలో అవయవ దానం పట్ల అవగాహన పెరుగుతోంది. అవయవదానంతో మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆర్గాన్స్ డోనర్స్ కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని. అవయవదానం చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన అవయవదాతలను స్మరించుకోవాలన్నారు. అవయవదానంతో 3800 మంది పునర్జన్మ పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…
టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన 60 వ పుట్టినరోజు సందర్భంగా అవయవదానం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో జరిగిన అవయవదాన అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా గా హాజరైన ఆయన.. తన 60 వ పుట్టినరోజు సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ..” మనిషిగా పుడతాం.. మనిషిగా పోతాం.. వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఏమి తీసుకెళ్లారు.. ఒక్క 200…