Organ Donation: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ వద్ద జరిగిన విషాద రోడ్డు ప్రమాదం విషాదంగా ముగిసింది. తొమ్మిది రోజుల క్రితం డివైడర్‌ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు యశ్వంత్, భూమిక తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డాక్టర్ యశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, డాక్టర్ భూమిక గాయాలతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, డాక్టర్ భూమికకు బ్రెయిన్ డెడ్ కావడంతో.. అవయవ దానం చేయాలని ఆమె కుటుంబం నిర్ణయించుకుంది. ఈ అవయవదానం ద్వారా మరో కొంతమంది ప్రాణాలను కాపాడే అవకాశం వచ్చింది. ఈ నిర్ణయం నిజంగా సమాజానికి ఒక స్ఫూర్తిధాయకంగా నిలుస్తోంది. డాక్టర్ భూమిక అవయవాలను దానం చేయడం ద్వారా ఆమె తల్లిదండ్రులు ఇతరుల జీవితాలను రక్షించారు.
Also Read: Gold Rates: హమ్మయ్యా.. స్థిరంగ కొనసాగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
ఏదేమైనా ఇలాంటి మంచి పనులు చేయడం ద్వారా పలువురికి మరల జీవితాన్ని ప్రసాదించినట్లయింది. ఈ సంఘటన తెలుసుకున్న సోషల్ మీడియా నెటిజన్స్ డాక్టర్ కుటుంబ సభ్యులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు డాక్టర్ మృతికి సంతాపం తెలుపుతూనే.. భూమిక తల్లిదండ్రులను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో మీలాంటివారు చాలా అవసరం అంటూ కామెంట్ చేస్తున్నారు.