Liver Donation: అర్థాంగి అనే మాటకు అర్థం చెప్పిన మహిళ.. తన భర్త ప్రాణాలకు తన ప్రాణం అడ్డేసి..!
- నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలిచిన లావణ్య
- కామెర్లతో పాటు కాలేయ సమస్యతో బాధపడుతున్న భర్త
- కాలేయం దానం చేసి భర్తకు ప్రాణాలు పోసిన లావణ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liver Donation: భార్య జీవితానికి సహచరురాలే కాదు, గమ్యానికి ప్రేరణ కూడా. ఆమె ప్రేమ, అనురాగం, బంధం భర్త జీవితాన్ని మరింత విలువైనదిగా మారుస్తాయి. భార్య అంటే కేవలం ఒక పాత్ర కాదు.. ఆమె భర్త ఆనందానికి మూలం, భర్త బాధలను తగ్గించే ఓదార్పు, ప్రతి విజయానికి వెనుక ఉన్న అండగా నిలిచే వ్యక్తి. ఆమె తోడు ఒక కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఒక సంతోషకరమైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది. భార్య తన చిన్న చిన్న చర్యలతో కూడా జీవితాన్ని సున్నితంగా, సుందరంగా తీర్చిదిద్దుతుంది. ఆమె ఒక స్నేహితురాలు, మార్గదర్శి, కష్టకాలంలో ధైర్యం ఇచ్చే తోడుగా ఉంటుంది. ఆమె చూపే ప్రేమ, చూపించే నమ్మకం, అందించే మద్దతు మన జీవితానికి నడిచే దారి చూపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, భార్య అంటే జీవితపు గుండె చప్పుడు, కుటుంబానికి ప్రాణమని చెప్పచ్చు.
Galla Ashok: దేవకీ నందన వాసుదేవ’ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అలాంటి ఓ భార్య తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఖమ్మం జిల్లాలో మానవత్వం, ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఘటన ఇది. రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధరావత్ శ్రీనివాస్, ఖమ్మం ఏపీజీవీబీ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షల కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించగా, కామెర్లతో పాటు కాలేయ సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చుతో మెరుగైన చికిత్సలు చేయించినా ఫలితం కనిపించలేదు. పలు పరీక్షల అనంతరం వైద్యులు కాలేయ మార్పిడి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
కాలేయ దాత కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఎక్కడా దాత దొరకలేదు. ఈ క్రమంలో, తన భర్తను ఎలా అయినా రక్షించుకోవాలని పట్టుదలతో లావణ్య తన కాలేయాన్ని దానం చేయాలని నిర్ణయించింది. వైద్యుల సిఫారసుల మేరకు లావణ్యకు అన్ని పరీక్షలు నిర్వహించగా, ఆమె కాలేయం శ్రీనివాస్‌కు సరిపోతుందని నిర్ధారించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు లావణ్య కాలేయం నుంచి 65 శాతం తీసి విజయవంతంగా శ్రీనివాస్‌కు అమర్చారు. ప్రస్తుతం శ్రీనివాస్, లావణ్య ఇద్దరూ ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. ఈ అరుదైన సంఘటనలో లావణ్య తన భర్తకు పునర్జన్మ ప్రసాదించి, అర్ధాంగి అనే పదానికి నిజమైన అర్థాన్ని తెలిపింది. ఆమె ధైర్యం, త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది. లావణ్యను నానా విధాలుగా అభినందనలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!