ఆ మాజీ మంత్రి సొంత ఇంట్లోనే పరాయి వాడై పోయాడా? అట్టహాసంగా పార్టీ నాయకుడి పదవీ స్వీకార కార్యక్రమం జరిగితే... ఆయన్ని కనీసం పిలిచే దిక్కు లేకుండా పోయిందా? కాకితో కబురంపితే వెళ్తామనుకున్నా... కనీసం ఆ కాకి కూడా కరవైపోయిందా? ఎవరా సీనియర్ లీడర్?
జిల్లా మొత్తం మీద ఆయనొక్కడే పోటుగాడా? ఆ మాత్రం దమ్మున్న లీడర్స్ ఇంకెవరూ లేరా? ఒక్కడికే నాలుగు పదవులు ఎలా ఇస్తారు? ఇదీ... ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన నేతల ఫ్రస్ట్రేషన్. ఇంతకీ ఎవరా నాలుగు పదవుల నాయకుడు?
పేరెంట్ డిపార్ట్మెంట్ వద్దు... పక్క శాఖ ముద్దు అంటున్నారా మహిళా అధికారి. తన సొంత శాఖకు ప్రమోషన్ ఇచ్చి పొమ్మన్నా పట్టించుకోకుండా ఆలయ ఈవోగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి ఓ ప్రముఖ ఆలయ అధికారిగా ఉండేందుకు చివరిదాకా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన ఆ అధికారి ఎవరు?
తెలంగాణ ప్రభుత్వంలో ఏదీ దాగే పరిస్థితి లేదా? దాచాలంటే దాగదులే... దాగుడు మూతలు చెల్లవులే అన్నట్టుగా ఉందా వ్యవహారం? అత్యంత కీలకమైనది, టాప్ సీక్రెట్ అనుకున్న రిపోర్ట్ కూడా ప్రతిపక్షం చేతికి అందిందా? లీకు వీరులు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా?
NTR Fan : జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో పెద్ద దుమారమే రేపింది. ఈ విషయంపై ఇప్పటికే ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి ఏకి పారేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఎవరికైతే ఫోన్ చేశాడో.. ఆ ధనుంజయ నాయుడు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. నేను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానిని. తెలుగు దేశం పార్టీలో…
అమెరికా అధ్యక్షుడ్ ట్రంప్ ఇండియాకు అడుగడుగునా ద్రోహమే చేస్తున్నారు. వీసాల విషయంలో కఠినంగా ఉంటున్నారు. వలసల అంశంలోనూ పగబట్టినట్టుగా వ్యవహరించారు. ఇక సుంకాలైతే చెప్పక్కర్లేదు. చివరకు కీలకమైన యుద్ధం సమయంలోనూ మనకు హ్యాండిచ్చారు. ట్రంప్ ను మొదట్నుంచీ నెత్తిన పెట్టుకున్న ఎన్నారైలకు.. వైట్ హౌస్ లో అడుగుపెట్టగానే షాకిచ్చారు ట్రంప్. అలాగే ట్రంప్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చిన మోడీకి కూడా తలనొప్పులే సృష్టించారు. ఏతావాతా ట్రంప్ మిత్రుడి ముసుగు తీసేయడంతో.. భారత్ కు అసలైన ద్రోహి…
ఆ జిల్లాలో కాషాయ పార్టీ మొత్తం ఉరుకులు పెడుతుంటే… ఆ ఒక్క నియోజకవర్గంలో ఎందుకు ఉసూరుమంటోంది? అక్కడ కూడా యుద్ధానికి సిద్ధమని సైనికులు అంటుంటే… దళపతి మాత్రం ఎందుకు ముందూ వెనకాడుతున్నాడు? బావ కళ్ళలో ఆనందం కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీని పణంగా పెడుతున్నారా? అవి కేవలం ఆరోపణలేనా? అందులో నిజం ఉందా? ఎవరా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బావా బావమరిది? ఏంటా స్పెషల్ లవ్ స్టోరీ? తెలంగాణలో కాషాయ పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో నిజామాబాద్…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్లు సిద్ధం చేస్తోందా? గెలుపు ఇప్పుడు పరువు ప్రతిష్టల సమస్యగా మారిపోయిందా? అందుకే… అందరికంటే ముందే కసరత్తు మొదలుపెట్టేసిందా? ఇంతకీ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? తెలంగాణ కాంగ్రెస్కు ఇప్పుడో అగ్ని పరీక్ష ఎదురైంది. అదే… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ బైపోల్లో గెలుపన్నది అటు పార్టీ… ఇటు ప్రభుత్వానికి సవాల్ అన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో ఉంది.18…
ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీ పరిస్థితి రాజు లేని రాజ్యంలా మారిపోయిందా? బాధ్యత తీసుకుని పార్టీని ముందుకు నడిపే నాయకులు కరవయ్యారా? పేరుకు నాయకులు ఉన్నా… జిల్లాను ఒక తాటి మీద నడిపించే స్థాయి ఉన్నవాళ్శు లేరా? అధికారంలో ఉండి కూడా ఇప్పుడెందుకు పార్టీకి అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అనగానే… ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అశోక్ గజపతి రాజు. పార్టీ ఆవిర్భావం నుంచి…
Youth vs Indian Politics: రాజకీయాలు అంటరానివని, అనవసరమని యువత ఫీలౌతున్నారు. నెలకు ఓ లక్ష రూపాయలు జీతం, చిన్న కారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు. అదే జీవితం అనుకుంటున్నారు. అంతకు మించి ఆలోచించటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో రాజకీయాలు వంశపారంపర్యం అయిపోయాయి. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేల వారసులే రాజకీయాల్లోకి వస్తున్నారు. వారిలో యూత్ ను వెతుక్కోవాల్సిందే కానీ.. సాధారణ యువత మాత్రం రాజకీయాలంటే అదో డర్టీ ప్రొఫెషన్ గా భావిస్తున్నారు. కాస్త…