తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు రేగుతున్నాయా? పట్టుమని పది నెలలు కూడా గడవకుండానే… జిల్లాల కొత్త అధ్యక్షులను మార్చుకోవాల్సి వస్తోందా? ఈ అధ్యక్షుడు మాకొద్దు మహాప్రభో అని ఏయే జిల్లాల కేడర్ అంటోంది? అసలు ఇప్పుడా మార్పు చర్చ ఎందుకు మొదలైంది పార్టీలో. ఇప్పుడు తప్పు ఆ అధ్యక్షులదా? అలాంటి వాళ్ళని నియమించిన పార్టీ పెద్దలదా? వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేశారు. పైకి మాత్రం అది రాజీనామాలా కనిపిస్తున్నా… అధ్యక్షుడే చేశారని చెబుతున్నా… ఇన్సైడ్ మేటర్…
తెలంగాణలో మంత్రుల పేరు చెప్పి పేషీల సిబ్బంది సెటిల్ మెంట్స్ చేసేస్తున్నారా? పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం పసిగట్టిందా? అందుకే ఎక్స్ట్రా నిఘా పెట్టిందా? ఎక్కడెక్కడ అలాంటి నిఘా కొనసాగుతోంది? ఏ రూపంలో ఉంది? తెలంగాణ సచివాలయంలో ఇప్పుడో సరికొత్త వాతావరణం కనిపిస్తోందట. నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం సాధారణమే అయినా… ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఇంటెలిజెన్స్ సిబ్బంది డేగకళ్ళతో దేని కోసమో వెదుకుతున్నట్టు అనిపిస్తోందంటున్నారు. మరీ ముఖ్యంగా మంత్రుల పేషీల విషయంలో…
బంధువులదేముంది రుతువుల్లాంటి వారు….. వస్తారు, పోతారు.. కానీ… వారసులు మాత్రం చెట్లలాంటి వారు. వస్తే పాతుకుపోతారన్న సినిమా డైలాగ్‌ని గుర్తుకు తెచ్చుకుంటున్నారట ఆ ఉమ్మడి జిల్లాలో. అక్కడ రాజకీయ వారసులు చేస్తున్న హంగామా అలా ఉందట. ప్రతి ప్రధాన పార్టీ తరపున పొలిటికల్ తెరంగేట్రం చేయడానికి వారసులంతా మూకుమ్మడిగా ఉవ్విళ్ళూరుతున్న ఆ ఉమ్మడి జిల్లా ఏది? అక్కడ ప్రత్యేకత ఏంటి? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఎన్నికల్ని తమ వారసులకు అప్రంటీస్లా వాడుకోవాలని…
ఏపీలో తాజాగా బయటపడ్డ నకిలీ లిక్కర్ స్కామ్ టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోందా? ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి అసలు పార్టీలోకి ఎలా వచ్చారు? పెద్దిరెడ్డి కుటుంబానికి వీర విధేయుడైన వ్యక్తికి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోకుండానే చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారా? అలా ఆయన్ని ప్రభావితం చేసిందెవరు? ఇప్పుడు వేళ్ళన్నీ ఎటువైపు చూపిస్తున్నాయి? మేం మొదట్నుంచి చెప్తూనే ఉన్నాం…. మీకే బుర్రకెక్క లేదు. ఈక్వేషన్లు, పోల్ మేనేజ్మెంట్ అంటూ… ఏవేవో కాకి లెక్కలు చెప్పి, మమ్మల్ని మభ్యపెట్టి…
తెలంగాణ కేబినెట్ కట్టు తప్పుతోందా? మంత్రుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందా? ఏమవుతుందిలే అనుకుంటూ.. నోటికి పనిచెప్పే బ్యాచ్ పెరుగుతోందా? అసలు అజెండా కంటే… సొంత అజెండానే కొందరికి ఎక్కువైపోయిందా? కొంచెం తగ్గించుకుంటే మేలేమో….. అని సొంత పార్టీ నేతలే ఎందుకు అనాల్సి వస్తోంది? మంత్రులు ఔటాఫ్ కంట్రోల్ అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? తెలంగాణ కేబినెట్ మంత్రుల్లో కొందరు అసలు పని గాలికొదిలేసి…. అనవసర విషయాల్లో అతిగా స్పందిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. మేం ఏం మాట్లాడినా నడిచిపోతుంది, ఏం…
ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి పొలిటికల్ వీఆర్ఎస్ తీసుకోబోతున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ఎందుకు ప్రకటించారు? అది రాజకీయ వైరాగ్యమా? లేక అంతకు మించిన వ్యూహమా? వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉండి, జగన్‌కు అత్యంత సన్నిహిడని పేరున్న ఆ లీడర్‌కి ఎవరు? పెద్ద స్థాయి పలుకుబడి ఉండి కూడా ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు? ఉమ్మడి శ్రీకాకుళంలో సుదీర్ఘ రాజకీయ ఆధిపత్యం చెలాయించారు ధర్మాన బ్రదర్స్. జిల్లాలో యాంటీ టీడీపీ స్టాండ్ అంటే……
ఆ పొలిటికల్ కపుల్ తమ పాత బేస్‌ని ప్లాన్ ప్రకారం వదిలేస్తున్నారా? తమ రాజకీయ ఉనికి కోసం కొత్త అదే పార్టీలో కొత్త ప్లాట్‌ఫామ్‌ని వెదుక్కుంటున్నారా? మేడమ్ ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలో వైసీపీ తరపున మరో నేత యాక్టివ్ అవడమే దీనికి సంకేతమా? ఏదా నియోజకవర్గం? ఒకచోట తగ్గిస్తూ… మరోచోట హైప్ ఇస్తున్న ఆ దంపతులు ఎవరు? వైసీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా పాలిటిక్స్‌లోకి వచ్చారు సాంబశివారెడ్డి. అయితే… సొంత నియోజకవర్గం శింగనమల ఎస్సీ…
ఆ ఇద్దరూ.. బీజేపీ నేతలే… కానీ వారి మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.కమలం పార్టీ ఎంపీ,ఎమ్మెల్యే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా?కాంట్రాక్టు పనుల కోసం ఇద్దరు నేతల వర్గీయుల మధ్య మళ్లీ వివాదం మొదలైందా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే వర్గీయుల ఆగ్రహానికి కారణం ఏమిటి ? కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గండికోట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కేంద్రమంత్రి చొరవతో సాస్కి…
తాడిపత్రిలో పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపు వివాదం చెలరేగుతుంది. పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి పట్టణ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి చలనా రూపంలో ఎటువంటి డబ్బులు కట్టించుకోలేదన్నారు. ఇంకా, పోలీసులు మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో బందోబస్తును కేతిరెడ్డికి కల్పిస్తూ.. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం…